Former CM: నేను హిట్ అండ్ రన్ చేయను..
ABN , First Publish Date - 2023-08-06T13:13:51+05:30 IST
నేను హిట్ అండ్ రన్ చేయలేదని, నైస్ అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వినతిపత్రం అందిస్తానని ఢిల్లీలో
- ఢిల్లీలో కాంగ్రెస్ అక్రమాలు బహిరంగం చేస్తా
- మాజీ సీఎం కుమారస్వామి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నేను హిట్ అండ్ రన్ చేయలేదని, నైస్ అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వినతిపత్రం అందిస్తానని ఢిల్లీలో బహిరంగం చేస్తానని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) పేర్కొన్నారు. ఇటీవల రెండు రోజులుగా పెన్ డ్రైవ్(pen drive)పై పలువురు మంత్రులు మాట్లాడుతున్నారని విడుదల చేస్తే దర్యాప్తు చేయగల సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. జేడీఎస్(JDS) కార్యాలయం జేపీ భవన్‌లో కుమారస్వామి శనివారం మీడియాతో మాట్లాడారు. నైస్ రోడ్డు నిర్మాణాల పేరిట రైతులకు సంబంధించిన భూములను దుర్వినియోగం చేశారన్నారు. ఇదో భారీ అవినీతి అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించానన్నారు. నైస్ అక్రమాలను ఢిల్లీలో విడుదల చేస్తానన్నారు. రైతుల పేరిట కోట్లాది రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. నైస్ అక్రమాలను వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల అపాయింట్‌మెంట్ కోరుతున్నానన్నారు.
నైస్ అక్రమాలపై న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానన్నారు. నైస్ అక్రమాలపై నివేదిక విషయంలో ఢిల్లీలో అధికార ప్రతినిధి టీబీ యచంద్రను బెదరించినవారు ఎవరని ప్రశ్నించారు. ఆ ఫోన్‌కాల్ ఎక్కడనుంచి వచ్చిందన్నారు. అవినీతిని మట్టి కరిపిస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ విచారణ ఏ విధంగా జరుపుతారో చూస్తామన్నారు. 30ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తి కాలేదని, కానీ భూములను దుర్వినియోగం చేశారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో సింగపూర్ వెళ్లినప్పుడు నైస్ సంస్థ ముఖ్యులు అశోక్ ఖేణి అక్కడికి చర్చలకు వచ్చారన్నారు. కానీ ఎటువంటి చర్చలైనా విధానసౌధలోనే అంటూ తిప్పి పంపానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బదిలీల దందాపై పెన్‌డ్రైవ్ చూపా నని, అందుకు ఇటీవల రెండు రోజులుగా ముఖ్యమంత్రితోపాటు మంత్రులు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. పెన్ డ్రైవ్ ఎప్పుడైనా విడుదల చేస్తానని, కానీ విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా..? అంటూ మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge)ను ఉద్దేశించి మండిపడ్డారు.
నేను హిట్ అండ్ రన్ చేయనన్నారు. సీఎం సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్ నేతలందరూ పే సీఎం అని, 40శాతం కమీషన్ అని నెలల తరబడి ప్రచారం చేశారని, ఎందుకు ఆధారాలు విడుదల చేయ లేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చా రని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారన్నారు. హోం మంత్రి పరమేశ్వర్ అలా మాట్లాడతారని అనుకోలేదన్నారు. సీఎం హోదాలో బదిలీల విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. కాగా డీసీఎం డీకే శివకుమార్(DCM DK Sivakumar) నా ఆరోపణలపై అన్న మాట్లాడాడు, తమ్ముడు వింటున్నాడనే వ్యాఖ్యలపై సూటిగా స్పందించారు. అటువంటి తమ్ముడు నాకొద్దని ఈ జన్మలో అతడికి అన్నను కాదలచుకోలేదన్నారు. బెంగళూరు మంత్రి ఒకరు 2019-20 నాటి పనులకు 5శాతం, 2020-21పనులకు 15శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. బ్రాండ్ బెంగళూరు సలహదారుల ద్వారా కమీషన్ సేకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.