Delhi Earthquake: హింద్‌-కుష్‌ శ్రేణుల్లో భూకంపం | In the Hind-Kush ranges Earthquake

Delhi Earthquake: హింద్‌-కుష్‌ శ్రేణుల్లో భూకంపం

ABN , First Publish Date - 2023-03-22T02:26:37+05:30 IST

భారత్‌, పాకిస్థాన్‌ సహా.. తొమ్మిది దేశాల్లో నేలకింద భూమి కదిలింది. అఫ్ఘానిస్థాన్‌లోని హింద్‌-కుష్‌ పర్వత శ్రేణులు కేంద్రంగా మంగళవారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10.22 గంటలకు భారీ భూకంపం సంభవించింది.

Delhi Earthquake: హింద్‌-కుష్‌  శ్రేణుల్లో   భూకంపం

రిక్టర్‌స్కేల్‌పై 6.8గా నమోదు

పాకిస్థాన్‌, భారత్‌ సహా

తొమ్మిది దేశాల్లో ప్రకంపనలు

పాకిస్థాన్‌ వ్యాప్తంగా ప్రభావం

ఇళ్లను వదిలి రోడ్లపైకి ప్రజలు

ఆస్పత్రుల్లో మెడికల్‌ ఎమర్జెన్సీ

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మార్చి 21: భారత్‌, పాకిస్థాన్‌ సహా.. తొమ్మిది దేశాల్లో నేలకింద భూమి కదిలింది. అఫ్ఘానిస్థాన్‌లోని హింద్‌-కుష్‌ పర్వత శ్రేణులు కేంద్రంగా మంగళవారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10.22 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.8గా ఉన్నట్లు అమెరికా జాగ్రఫికల్‌ సర్వే వెల్లడించింది. భూగర్భంలో 184 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని వివరించింది. భారత్‌, పాకిస్థాన్‌ సహా.. అఫ్ఘానిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, కజ్కిస్థాన్‌, చైనాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్‌వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దీని ప్రభావం కనిపించింది. ఇటీవలి తుర్కియే భూకంపం.. వరుస ప్రకంపనల నేపథ్యంలో పెరిగిన మరణాల తీవ్రత దృష్ట్యా.. ఇస్లామాబాద్‌, రావల్పిండి, లాహోర్‌ సహా.. ప్రధాన నగరాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైనే పడిగాపులుకాచారు. రాత్రంతా రోడ్డుపక్కన, కార్లు, వాహనాల్లో నిద్రించారు. కడపటి వార్తలందేసరికి.. ఇస్లామాబాద్‌లో భూకంపం రాగానే బయటకు పరుగులు తీసే క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై, మరణించాడు. బలూచిస్థాన్‌లో శిథిలాలు పడి ఓ మహిళ మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. లోయర్‌ ధిర్‌ ప్రాంతంలో శిథిలాల కారణంగా ఏడుగురు గాయపడ్డారని, పదుల సంఖ్యలో ప్రజలు తొక్కిసలాటలో గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. కాగా.. భారత్‌లోనూ భూకంప ప్రభావం కనిపించింది. గ్రేటర్‌ నో యిడా, ఎన్‌సీఆర్‌-ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

Updated Date - 2023-03-22T02:26:37+05:30 IST