AP Highcourt: పేర్నినాని పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అభ్యంతరం
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:20 PM
Andhrapradesh: పేర్నినాని పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు.
అమరావతి, డిసెంబర్ 24: గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perninani), ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్‌లో (AP highcourt) మంగళవారం విచారణ జరిగింది. విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు. గడువు ముగిసిన నేపథ్యంలో పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని, తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని న్యాయస్థానాన్ని న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్నినాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాలశాఖకు లీజుకిచ్చారు. అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయని పేర్కొంటూ చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
డెడ్ బాడీ పార్శిల్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
మరోసారి వాయిదా..
మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. పీపీ సెలవులో ఉండటంతో మరోసారి బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు. ఈరోజు ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ సెలవు పెట్టారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవటంతో పిటిషన్‌ను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు. అలాగే కౌంటర్ దాఖలు విషయంలో పోలీసుల తీరుపై కూడా జడ్జి అసహనం వ్యక్తం చేశారు.పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్‌పై వాయిదా పడటం ఇది నాలుగోసారి.
కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సుమారు 187 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు బయటకు వచ్చినప్పటి నుంచి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. గత పది రోజులుగా పేర్ని నాని సతీమణి జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం పేర్నినాని బయటకు వచ్చి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్‌పై క్లారిటీ వచ్చే వరకు పేర్నినాని సతీమణిని బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు పేర్నినాని భార్యపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇటీవల పేర్నినాని కుటుంబానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు సహకరించాల్సిందిగా పేర్నినాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పేర్నినాని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులను అంటించారు. నోటీసులను పేర్నినాని చూడకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ..
ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..
Read Latest AP News And Telugu news