Kolkata : దేశంలో అత్యంత సురక్షిత నగరం కోల్‌కతా
ABN , First Publish Date - 2023-12-06T01:51:56+05:30 IST
వరుసగా మూడో ఏడాది కోల్‌కతా నగరం దేశంలో సురక్షిత నగరంగా నిలిచింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి లక్ష మందికి అతి తక్కువ గుర్తించదగిన నేరాలు

మూడో స్థానంలో హైదరాబాద్.. ఎన్సీఆర్బీ వెల్లడి
కోల్‌కతా, డిసెంబరు 5: వరుసగా మూడో ఏడాది కోల్‌కతా నగరం దేశంలో సురక్షిత నగరంగా నిలిచింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి లక్ష మందికి అతి తక్కువ గుర్తించదగిన నేరాలు నమోదయ్యే నగరంగా నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరంలో ప్రతి లక్ష మందికి కేవలం 86.5 కేసులతో కోల్‌కతా ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో పుణె(280.7), హైదరాబాద్(299.2) నగరాలు నిలిచాయి. ఐపీసీ అలాగే ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసులను మాత్రమే గుర్తించదగిన నేరాలుగా పరిగణిస్తారు. కోల్‌కతాలో 2021లో లక్ష మంది జనాభాకు103.4గా నమోదైన కేసులు 2022కి 86.5కు తగ్గిపోయాయి. దేశంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నమోదైన నేరాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించారు.