Kanwar yatra : కన్వర్ యాత్రపై రాళ్ల దాడి.. మధ్య ప్రదేశ్ పోలీసుల లాఠీఛార్జ్..

ABN , First Publish Date - 2023-08-08T11:13:17+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో కన్వర్ యాత్రలో పాల్గొన్న మహాశివుని భక్తులపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కహర్వాడీ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ యాత్ర సజావుగానే సాగింది.

Kanwar yatra : కన్వర్ యాత్రపై రాళ్ల దాడి.. మధ్య ప్రదేశ్ పోలీసుల లాఠీఛార్జ్..

భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో కన్వర్ యాత్రలో పాల్గొన్న మహాశివుని భక్తులపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కహర్వాడీ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ యాత్ర సజావుగానే సాగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కహర్వాడీ ప్రాంతంలోకి వచ్చేసరికి మహాశివుని భక్తులపై రాళ్ల దాడి జరగడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వదంతులను వ్యాపింపజేయవద్దని ప్రజలను పోలీసులు కోరారు. సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదిలావుండగా, భక్తులు ‘‘హరహర శంభో’’, ‘‘జై జై శంభో శంకర’’ వంటి నినాదాలు చేస్తూ, నృత్యం చేస్తూ నడుస్తుండగా, వారిపై రాళ్ల దాడి జరిగింది. వీరంతా మహాదేవ్‌గఢ్‌లోని శివాలయానికి వెళ్తున్నారు. ఈ దేవాలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. రాళ్ల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీని ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..

Delhi Service Bill : ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి..

Updated Date - 2023-08-08T11:13:17+05:30 IST