Madhya Pradesh : గ్రామ సర్పంచ్ విధించిన వింత నిబంధన.. ఆవులను వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు..
ABN , First Publish Date - 2023-07-21T15:47:31+05:30 IST
పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు. మధ్య ప్రదేశ్‌లోని నాగనడుయి గ్రామ సర్పంచ్ కూడా అలాంటి ఆదేశాలనే జారీ చేశారు. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించారు.
భోపాల్ : పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు. మధ్య ప్రదేశ్‌లోని నాగనడుయి గ్రామ సర్పంచ్ కూడా అలాంటి ఆదేశాలనే జారీ చేశారు. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి, అందరికీ తెలియజేశారు.
సర్పంచ్ ఆదేశాలను ఉద్యోగులు ప్రజలకు తెలియజేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో బయటపడింది. ఉద్యోగులు డప్పు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ ఈ శిక్ష గురించి చెప్తుండటం ఈ వీడియోలో వినిపించింది. పశువులు, ఆవులను యథేచ్ఛగా గ్రామంలో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని వీరు ప్రకటించారు.
అయితే గ్రామస్థులు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించాలని కోరారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వీరికి మద్దతుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి :
CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు