School Jobs Scam Case: మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ను ప్రశ్నించిన సీబీఐ
ABN , First Publish Date - 2023-05-20T12:42:59+05:30 IST
పశ్చిమబెంగాల్ స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ను సీబీఐ శనివారం ప్రశ్నించింది....
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ను సీబీఐ శనివారం ప్రశ్నించింది.(School Jobs Scam Case)పాఠశాల టీచర్ ఉద్యోగాల కుంభకోణంపై విచారణకు సంబంధించి టీఎంసీ నేతలకు సన్నిహితుడైన సుజయ్ కృష్ణ భద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంతకుముందు రోజు దాడులు నిర్వహించిందని కేంద్ర ఏజెన్సీ అధికారి చెప్పారు.భారీ బందోబస్తు మధ్య అభిషేక్ బెనర్జీ (Mamata Banerjee's Nephew Abhishek)నిజాం ప్యాలెస్‌లోని సీబీఐ(CBI) కార్యాలయానికి వచ్చారు.
ఇది కూడా చదవండి : Indian Army rescues: నార్త్ సిక్కింలో 500మంది పర్యాటకులను కాపాడిన ఇండియన్ ఆర్మీ
పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమంగా ఉపాధ్యాయుల నియామకాలకు పాల్పడినట్లు ఆరోపణలపై మార్చి 15వతేదీన భద్ర సీబీఐ ఎదుట హాజరయ్యారు. ‘‘నాపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఏదైనా రుజువు ఉంటే, నన్ను అరెస్టు చేయండి’’ అని బంకురాలో జరిగిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ అన్నారు.టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తనను విచారించవచ్చని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కోరుతూ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోల్ కత్తా హైకోర్టు గురువారం కొట్టివేసింది.ఈ కుంభకోణంలో నిందితుడైన కుంతల్ ఘోష్ దాఖలు చేసిన ఫిర్యాదులో టీఎంసీ నేత పేరు ప్రస్తావనకు వచ్చింది. పాఠశాల కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీ పేరు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఒత్తిడి తెస్తున్నాయని ఘోష్ ఆరోపించారు.