ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కేసులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-02T16:04:35+05:30

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

జైపూర్: రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య జరగడం పట్ల రాజస్థాన్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ప్రధాని ఆరోపించారు. ‘‘ఉదయ్‌పూర్‌లో ఏం జరిగిందో ఎవరూ ఊహించలేదు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో వచ్చిన వారు టైలర్ గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. నేను కాంగ్రెస్‌ను అడగాలనుకుంటున్నాను. ఉదయపూర్ టైలర్ హత్య సమయంలో ఆ పార్టీ ఏమి చేసింది? వారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు.’’ అని మోదీ అన్నారు.


రాజస్థాన్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నప్పుడు కన్హయ్య లాల్ హత్య గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇక్కడ తలలు నరికే ఘటనలు జరుగుతున్న వాతావరణంలో పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రధాని ప్రశ్నించారు. ఇది మాములు నేరం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని ప్రధాని నిలదీశారు. “కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా, నేరస్థులకు స్వేచ్ఛ ఇస్తున్నారు. వారిపై ఆప్యాయతతో వ్యవహరిస్తున్నారు. దీంతో చట్టం అంటే వారికి భయం ఎలా ఉంటుంది?" అని ఆయన ప్రశ్నించారు.

కాగా గతేడాది జూన్ 28న ఉదయ్‌పూర్‌లో తన దుకాణంలో కన్హయ్య లాల్ అనే టైలర్ పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అతడిని నరికి చంపి పారిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన వైరల్‌గా మారింది. దీంతో ఈ దారుణ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కన్హయ్య లాల్‌ను చంపినట్లు ఇద్దరు వ్యక్తులు అంగీకరించిన వీడియో బయటికొచ్చింది. కాగా కన్హయ్య లాల్‌ హత్యకేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Updated Date - 2023-10-02T16:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising