President: 6, 7 తేదీల్లో పుదుచ్చేరికి రాష్ట్రపతి
ABN , First Publish Date - 2023-07-20T09:05:32+05:30 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రెండు రోజుల పర్యటన కోసం కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి(Puducherry)కి ఆగస్టు
పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రెండు రోజుల పర్యటన కోసం కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి(Puducherry)కి ఆగస్టు 6వ తేది రానున్నారని ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన సీఎం రంగస్వామి.. పుదుచ్చేరి ప్రభుత్వం ఆధ్వర్యంలో వంట గ్యాస్ రాయితీ రూ.300, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహక నిధి, ఆడపిల్లలకు రూ.50 వేలు డిపాజిట్ పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారన్నారు. ఆమె ఇక్కడ రెండు రోజులు ఉంటారని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం బెంగళూరు నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం రప్పిస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రపతి జూలై రెండో వారంలో పుదుచ్చేరిలో పర్యటించాల్సివుంది. అయితే ఆమె విదేశాలకు వెళ్లడంతో ఇప్పుడు రానున్నారు.