Tomato prices: దిగి వస్తున్న టమోటా ధరలు.. కిలో ఎంతంటే..

ABN , First Publish Date - 2023-08-08T11:09:02+05:30 IST

వినియోగదారులను నెలరోజులుగా గజగజలాడించిన టమోటా ధరలు(Tomato prices) ఎట్టకేలకు దిగి వస్తున్నాయి.

Tomato prices: దిగి వస్తున్న టమోటా ధరలు.. కిలో ఎంతంటే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): వినియోగదారులను నెలరోజులుగా గజగజలాడించిన టమోటా ధరలు(Tomato prices) ఎట్టకేలకు దిగి వస్తున్నాయి. టమోటాలు ఎక్కువగా పండించే కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల ఏపీఎంసీ మార్కెట్లకు మూడు రోజులుగా టమోటా భారీగా తరలిస్తుండడమే ఇందుకు కారణం. 15 కిలోల టమోటా బాక్స్‌ ధర వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఫలితంగా రిటైల్‌ మార్కెట్‌లో మూడు రోజుల క్రితం వరకు కిలో రూ.120పై చిలుకు పలికిన టమోటా ధర ప్రస్తుతం రూ.80-90 మధ్య ఉంది. అయితే నాణ్యమైన టమోటా ధర ఇంకా రూ.100కుపైగానే ఉండడం గమనార్హం. మరో వారం రోజుల్లో మార్కెట్‌కు మరింత టమోటా పంట తరలిరావచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టమోటా ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-08-08T11:09:02+05:30 IST