Spinach: చలికాలంలో బచ్చలి కూర తినడం మంచిదేనా.. దీనితో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-11-18T16:51:09+05:30 IST
చ్చలి కూరలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శీతాకాలంలో బచ్చలికూరను తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలపు ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలలో ముఖ్యంగా శరీరంలో పోషకాల అభివృద్ధి బావుంటుంది. పోషక శక్తిని పెంచుతుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది కనుక విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఐరెన్, మెగ్నీషియం వంటి అద్భుతవిలువలను శరీరానికి అందిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శీతాకాలం తరచుగా జలుబు చేస్తుంటే కనుక ఫ్లూ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బచ్చలికూర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఎముక పుష్టికి..
బచ్చలి కూరలో విటమిన్ కె, కాల్షియం నియంత్రణకు సహకరిస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు పగుళ్ళు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: శీతాకాలం సాయంత్రాలు తీసుకునే టాప్ 7 హేల్తీ స్నాక్స్ ఇవే..!
గుండె ఆరోగ్యం
బచ్చలికూర ఫోలేట్, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి ఫోలేట్ హెూమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలోనూ, ఇది పెరిగినపుడు గుండె వ్యాధులనుంచి కాపాడటంలోనూ సహకరిస్తుంది.
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
బచ్చలి కూరలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు బచ్చలకూరను తప్పక తీసుకోవాలి.
శక్తి బూస్టర్..
శరీరం అంతటా ఆక్సిజన్ రవాణాకు పనిచేయడమే కాకుండా, అలసటను తగ్గిస్తుంది. ఇది ఈ శీతాకాలపు ఆహారంగా చక్కని ఎంపిక అవుతుంది. ఆరోగ్యానికి మంచి సపోర్ట్ గా నిలుస్తుంది.