Share News

Kidney Health : మూత్రపిండాలు ఇలా క్షేమం

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:32 PM

శరీరంలో ఏ కారణంగా వ్యర్థాలు పేరుకుపోయినా వాటి దుష్ప్రభావం ముందు కిడ్నీల పైన పడుతుంది. అందుకే కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే, శరీరంలోని అన్ని అవయవాలూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఒక్కో అవయవానికీ శ

Kidney Health : మూత్రపిండాలు ఇలా క్షేమం

శరీరంలో ఏ కారణంగా వ్యర్థాలు పేరుకుపోయినా వాటి దుష్ప్రభావం ముందు కిడ్నీల పైన పడుతుంది. అందుకే కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే, శరీరంలోని అన్ని అవయవాలూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఒక్కో అవయవానికీ శక్తినిచ్చే సహజ సిద్ధమైన కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని...

నిమ్మ: అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండే వాటిల్లో నిమ్మకాయ ఒకటి. ఎక్కువ మంది అందులోని విశేషాలను పెద్దగా పరగణనలోకి తీసుకోరు. నిజానికి, శరీరంలోని కలుషితాలను బయటికి పంపడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ పరగడుపున ఒక నిమ్మకాయ రసాన్ని, నీళ్లలో కలిపి తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. శరీర బరువును తగ్గించడం నిమ్మ కలిగి ఉండే మరొక గొప్ప గుణం.

యాపిల్‌: దీనిలో విటమిన్లు, లవణాలు, పీచుపదార్థం ఎలాగూ ఉంటాయి. వీటితో పాటు యాపిల్‌లో ఉండే ఫైటో కెమికల్స్‌ శరీర వ్యర్థాలను చాలా వేగంగా బయటికి పంపిస్తాయి. విటమిన్‌- సి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా మారుస్తుంది.

బెర్రీ పండ్లు: స్ట్రాబెర్రీ, బ్లాక్‌ బెర్రీ, బ్లూ బెర్రీ... ఈ జాతి పండ్లన్నింటిలోనూ సి విటమిన్‌, పీచుపదార్థం సమృద్దిగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫ్యాటీ యాసిడ్‌ శరీరం బరువును అదుపులో ఉంచుతుంది.

పైనాపిల్‌: ఈ పండుతో కీళ్ల సమస్యల వల్ల వచ్చే వాపు తగ్గడంతో పాటు, గాయాలు కూడా త్వరగా మానతాయి.

Updated Date - Dec 02 , 2024 | 11:32 PM