Messenger video calls : వీడియో కాల్స్‌తో మెసెంజర్‌లో గేమ్స్‌ ప్లే

ABN , First Publish Date - 2023-04-07T23:16:22+05:30 IST

మెసెంజర్‌కు కొత్తగా గేమింగ్‌ ఫీచర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వెబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారంపై 14 గేమ్స్‌ ఉన్నాయి. బాంబే ప్లేకు చెందిన కార్డ్‌వార్స్‌,

 Messenger video calls : వీడియో కాల్స్‌తో మెసెంజర్‌లో గేమ్స్‌ ప్లే

మెసెంజర్‌కు కొత్తగా గేమింగ్‌ ఫీచర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వెబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారంపై 14 గేమ్స్‌ ఉన్నాయి. బాంబే ప్లేకు చెందిన కార్డ్‌వార్స్‌, కోట్‌సింక్‌ - ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ వంటివి ఉన్నాయి. ఈ ఆటలు దేనికది ఎంతమంది ఆడుకోవచ్చు చెబుతోంది. అయితే ఎక్కువ ఆటలు కేవలం ఇద్దరు మాత్రమే ఆడగలరు. అలాగే వీడియో కాల్‌తో పాటు గేమ్స్‌లో పాల్గొనవచ్చు. ఇందుకోసం

  • మొదట లేటెస్ట్‌ వెర్షన్‌ మెసెంజర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్‌ అలాగే స్నేహితులు కూడా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూసుకోవాలి.

  • మెసెంజర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కనీసం ఒకరితో వీడియో కాల్‌ ఆరంభించాలి.

  • అవతలి వ్యక్తి చేరిన తరవాత గ్రూప్‌ మోడ్‌ బటన్‌ని టాప్‌ చేయాలి.

  • ప్లే ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

  • అందుబాటులో ఉన్న గేమ్‌ చూసుకుని టాప్‌ చేయాలి. తదుపరి ఆట ఆరంభించాలి.

  • మెసెంజర్‌ యాప్‌లో వీడియో కాల్‌ స్ర్కీన్‌ చిన్నది రెండూ టాప్‌లో ఒకటవుతాయి.

Updated Date - 2023-04-07T23:16:22+05:30 IST