Tandai : తండాయి తయారీ ఇలా!

ABN , First Publish Date - 2023-03-12T00:19:40+05:30 IST

వేసవి కాలం వస్తే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కోలాలు ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోలాలకు ప్రత్యామ్నాయంగా తండాయిని తాగమంటారు మన పెద్దలు. దీనిలో ఉండే రకరకాల

Tandai  : తండాయి తయారీ ఇలా!

వేసవి కాలం వస్తే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కోలాలు ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోలాలకు ప్రత్యామ్నాయంగా తండాయిని తాగమంటారు మన పెద్దలు. దీనిలో ఉండే రకరకాల పదార్థాలు మనలోని రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయని పౌష్టికాహార నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇన్ని శుభలక్షణాలున్న తండాయిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

ఒక పావు కప్పు బాదం, ఒక పావు కప్పు పిస్తా, ఒక పావు కప్పు జీడిపప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ సొంపు, ఒక టేబుల్‌ స్పూన్‌ పాపీ సీడ్స్‌, 5 ఏలకులు, ఒక చిటికెడు కుంకుమ పువ్వు, కొన్ని గులాబీ రేకులు, ఒక అరలీటరు పాలు.

తయారుచేసే విధానం

తండాయి మసాలాను తయారు చేయటానికి పైన పేర్కొన్న దినుసులన్నింటినీ నెమ్మదిగా వేయించాలి. ఆ తర్వాత వీటిని చల్లారనివ్వాలి. వీటికి కుంకమ పువ్వు, గులాబీ రేకులను కలపాలి. మిక్సీలో వేసి వీటిని పొడిగా చేయాలి. ఆ తర్వాత అరలీటరు కాగుతున్న పాలలో ఈ పొడిని వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ పాలను చల్లబరచాలి. రిఫ్రిజరేటర్‌లో ఉంచాలి. ఈ పద్ధతిలో చేసిన తండాయి- మూడు, నాలుగు రోజుల వరకూ తాజాగా ఉంటుంది.

Updated Date - 2023-03-12T00:19:40+05:30 IST