NRI: చికాగోలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి దుర్మరణం.. | Vijayawada resident devansh who was shot at in chicago succumbs to injuries pcs spl

NRI: చికాగోలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి దుర్మరణం..

ABN , First Publish Date - 2023-01-23T21:49:18+05:30 IST

అమెరికాలోని చికాగో నగరంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో విజయవాడకు చెందిన దేవాన్ష్ దుర్మణం చెందారు.

NRI: చికాగోలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి దుర్మరణం..

అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు తెలుగు విద్యార్థుల్లో ఒకరు దుర్మణం చెందారు. విజయవాడకు చెందిన దేవాన్ష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయాల కారణంగా మరణించారు. హైదరాబాదీ విద్యార్థి సాయిచరణ్ పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. చరణ్, దేవాన్ష్‌లు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా నల్లజాతికి చెందిన కొందరు కారులో వచ్చి వారిని అడ్డగించారు. వారి వద్ద ఉన్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఈ క్రమంలో యువకులు భయభ్రాంతులకు లోనై తప్పించుకునేందుకు యత్నించగా నిందితులు వారిపై కాల్పులు జరిపారు. చరణ్‌కి ఛాతీలో, దేవాన్ష్‌కు భుజం, వెన్నులోకి బుల్లెట్స్ దూసుకుపోయాయి.

Updated Date - 2023-01-23T22:08:08+05:30 IST