Viral Video: టీచర్‌పై కుర్చీ విసిరికొట్టిన విద్యార్థిని.. తలకు బలంగా తగిలి నెత్తురోడుతుంటే.. చూస్తూ నిలబడ్డ మిగతా స్టూడెంట్స్!
ABN , First Publish Date - 2023-10-03T10:32:38+05:30 IST
అమెరికాలోని మిచిగాన్‌లో (Michigan) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని తన టీచర్ తలపై కుర్చీతో విసిరికొట్టింది.
Viral Video: అమెరికాలోని మిచిగాన్‌లో (Michigan) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని తన టీచర్ తలపై కుర్చీతో విసిరికొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఉపాధ్యాయురాలి తలకు కుర్చీ బలంగా తగిలి నెత్తురోడుతుంటే.. మిగతా స్టూడెంట్స్ చూస్తూ నిలబడ్డారు తప్ప ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ షాకింగ్ సంఘటన ఫ్లింట్ సౌత్ వెస్ట్రన్ అకాడమీ హై స్కూల్‌లో (Flint Southwestern Academy High School) గత గురువారం (సెప్టెంబర్ 28) జరిగింది. ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవను ఆపేందుకు టీచర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిలో ఓ విద్యార్థి (Student) టీచర్‌పై వెనక నుంచి కుర్చీ విసిరేయడం వీడియోలో రికార్డైంది. ఇక కుర్చీ ఉపాధ్యాయురాలి (Teacher) తలకు బలంగా తగలడంతో నెత్తురోడుతూ ఆమె నేలపై కుప్ప కూలింది. ఆ సమయంలో విద్యార్ధులు ఎవరూ ఆమెకు ఏమైందో చూడడానికి గానీ, సహాయం చేయడానికి వెళ్లకపోవడం వీడియోలో కనిపించింది.
అయితే, కొద్ది సేపటి తర్వాత అటువైపుగా వచ్చిన ఇతర టీచింగ్ స్టాఫ్ ఆమె తలకు గాయమై నేలపై పడి ఉండడం చూసి షాకయ్యారు. వెంటనే ఉపాధ్యాయురాలిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్నాక ఆమెను అదే రోజు డాక్టర్లు ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది. త్వరలో తిరిగి టీచింగ్ స్టార్ట్ చేయనుందని ఫ్లింట్ కమ్యూనిటీ స్కూల్స్ సూపరింటెండెంట్ తెలిపారు.
ఇక వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో కుర్చీ విసిరిన 15 ఏళ్ల విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై రెండు అభియోగాలు మోపారు. నేరం రుజువైతే విద్యార్థినికి నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘర్షణలో పాల్గొన్న రెండో విద్యార్థిని కూడా అరెస్టు చేశారు. ఈ వీడియో చూసాక విద్యార్థులకు క్రమశిక్షణ లేదని, ఉపాధ్యాయులను గౌరవించడం లేదని కొందరు మండిపడ్డారు.
US Visas: భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అగ్రరాజ్యం అమెరికా..!