Heavy Rains in US: న్యూయార్క్‌ను ముంచెత్తిన వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం!

ABN , First Publish Date - 2023-09-30T10:08:07+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా (America) లో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తుతున్నాయి. యూఎస్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ (New York) ను వరదలు ముంచెత్తాయి.

Heavy Rains in US: న్యూయార్క్‌ను ముంచెత్తిన వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం!

Heavy Rains in US: అగ్రరాజ్యం అమెరికా (America) లో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తుతున్నాయి. యూఎస్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ (New York) ను వరదలు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరాన్ని వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. దాంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని (State of Emergency) ప్రకటించింది.

NYC.jpg

అక్కడి స్థానిక మీడియా తెలిపిన సమాచారం ప్రకారం న్యూయార్క్ సిటీలో కుండపోత వర్షాలు (Heavy Rains) పడుతుండటంతో రహదారులు, సబ్‌వేలు జలశయాలను తలపిస్తున్నాయి. వరదల దృష్ట్యా న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ (Kathy Hochul) ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్‌లో దాదాపు 18 మిలియన్ల మంది నివసిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

New-York-City.jpg

ఇక న్యూయార్క్‌తో పాటు న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. అమెరికా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం పలు ప్రాంతాల్లో ఏకంగా 6 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావడం జరిగింది. అలాగే రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

US Visas: భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన అగ్రరాజ్యం అమెరికా..!

Updated Date - 2023-09-30T10:19:44+05:30 IST