Telangana వ్యాప్తంగా సంచలనం సృష్టించిన..భోగ శ్రావణి వ్యవహారం..ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

ABN , First Publish Date - 2023-01-31T14:20:03+05:30 IST

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది

Telangana వ్యాప్తంగా సంచలనం సృష్టించిన..భోగ శ్రావణి వ్యవహారం..ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఎపిసోడ్‌ బీఆర్ఎస్‌లో హాట్‌టాపిక్‌ మారిందా?.. బోగ శ్రావణి వ్యవహారంలో కౌన్సిలర్లు వెనక్కి తగ్గడం లేదా?.. శ్రావణి రాజీనామా వెంటనే ఆమోదించాలని జిల్లా నేతలపై ఒత్తిడి పెరుగుతోందా?.. శ్రావణిని తప్పిస్తే.. ఆ పదవి దక్కించుకునేందుకు కొందరు కౌన్సిలర్లు లాబీయింగ్ మొదలు పెట్టారా?.. చైర్‌పర్సన్‌ విషయంలో కౌన్సిలర్లు ఒకలా భావిస్తే.. అధిష్టానం మరోలా ఆలోచిస్తోందా?.. ఇంతకీ.. రాజీనామా ఆమోదం కోసం ఒత్తిడి చేస్తున్న కౌన్సిర్లు ఎవరు?.. చైర్‌పర్సన్‌ ఎంపికలో అధిష్టానం ప్లాన్‌ ఏంటి?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1854.jpg

శ్రావణి ఎపిసోడ్‌లో హీట్‌

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వేధించారంటూ ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బోరున విలపించడం దుమారం రేపింది. వేధింపులు తట్టుకోలేక మునిసిపల్ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. శ్రావణి ఎపిసోడ్‌లో హీట్‌ కొనసాగుతున్నప్పటికీ.. అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కౌన్సిలర్లు మాత్రం ఆ విషయంలో తగ్గేదే లేదంటుండడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.

Untitled-2054.jpg

రేపో మాపో శ్రావణి రాజీనామాకు ఆమోదం!

మరోవైపు... జగిత్యాల మున్సిపల్‌ కౌన్సిలర్లు.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి శ్రావణిని వెంటనే తొలగించాలని వేడుకుంటున్నారు. అంతేకాదు.. శ్రావణి వ్యవహారాన్ని ఎక్కువ రోజులు నాన్చొద్దని.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని.. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణను కోరినట్లు తెలుస్తోంది. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదింపజేయాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్‌ సీనియర్ నేతలపైనా ప్రెజర్‌ పెడుతున్నారు. దీంతో.. రేపో మాపో శ్రావణి రాజీనామా ఆమోదింపచేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. రాజీనామా ఆమోదించిన తర్వాత శ్రావణి ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారన్నది కూడా బీఆర్ఎస్‌తోపాటు జగిత్యాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Untitled-1905.jpg

మున్సిపల్ పీఠం కోసం కౌన్సిలర్లు లాబీయింగ్

ఇదిలావుంటే... జగిత్యాల మున్సిపల్ పీఠం కోసం కొందరు కౌన్సిలర్లు అప్పుడే లాబీయింగ్ కూడా మొదలుపెట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన భోగ శ్రావణి తప్పుకోవడంతో.. అదే వర్గానికి చెందిన అడువాల జ్యోతికి చైర్‌పర్సన్‌ పదవి కట్టబెడతారన్న టాక్‌ నడుస్తోంది. దానిలో భాగంగానే.. జ్యోతి.. కౌన్సిలర్ల అందరితో మాట్లాడుతున్నారు. అటు.. భోగ శ్రావణి కంటే ముందే మూడేళ్ల క్రితం మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిన సమ్మిండ్ల వాణి కూడా కొత్తగా ప్రయత్నాలు సాగిస్తుండడంతో హీట్‌ పెరుగుతోంది. కానీ.. వాణి మున్నూరు కాపు సామాజిక వర్గం కావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే.. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండారు రజిత కూడా మున్సిపల్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. అయితే.. పద్మశాలి వర్గాన్ని శాంతింప చేయడం కోసం అదే సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్‌కు అధిష్టానం చైర్మన్ గిరీ కట్టబెడుతుందన్న చర్చ జరుగుతోంది.

Untitled-24888.jpg

అధిష్టానం ఆశీస్సులు ఎవరిని వరిస్తాయో..

ఇక.. జగిత్యాల మున్సిపల్‌ పీఠం విషయంలో పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్లాన్‌ చేస్తున్నారు. పార్టీ ఆలోచనేంటో తెలిసిపోవడంతో ఆశావహులు కూడా దానికి తగ్గట్లే అడుగులు వేస్తున్నారు. దీనిలోభాగంగానే.. సమ్మిండ్ల వాణితోపాటు అడువాల జ్యోతి ఎమ్మెల్యే సంజయ్‌తో మంతనాలు మొదలుపెట్టారు. శ్రావణి వ్యవహారంతో పద్మశాలి వర్గానికి చెందిన కౌన్సిలర్‌కే చైర్మన్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

Untitled-23588.jpg

జ్యోతి, వాణి, రజితతోపాటు మరో ఇద్దరు కూడా చైర్మన్ పీఠం కోసం లాబీయింగ్ చేస్తున్నారు. అయితే.. మున్సిపల్‌ ఛైర్మన్‌ గిరీ ఎవరికి ఇవ్వాలన్న దానిపై కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, ఎల్‌.రమణ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. జిల్లా పెద్దల రిపోర్ట్‌ను బట్టి మున్సిపల్‌ పీఠం ఎవరికి అప్పగించాలన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా.. జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ గిరి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో.. అధిష్టానం ఆశీస్సులు ఎవరిని వరిస్తాయో చూడాలి మరి..

Untitled-2165.jpg

Updated Date - 2023-01-31T14:22:10+05:30 IST