ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?

ABN, First Publish Date - 2023-03-13T23:57:04+05:30

నల్లారి.. ఈ ఇంటి పేరుకో చరిత్ర ఉంది. నల్లారి అమర్నాథ్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. కాంగ్రెస్‌తో అరంగేట్రం చేసిన నల్లారి ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంతా చిత్తూరు జిల్లాలో కీలక పాత్రే పోషించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నల్లారి.. ఈ ఇంటి పేరుకో చరిత్ర ఉంది. నల్లారి అమర్నాథ్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. కాంగ్రెస్‌తో అరంగేట్రం చేసిన నల్లారి ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కీలక పాత్రే పోషించింది. ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావులతో నల్లారి ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అమర్నాథ్ అన్ని ప్రాధాన్య పదవులూ అనుభవించి.. అడుగు దూరంలో సీఎం సీటును కోల్పోయారు. ఆయన తర్వాత కిరణ్ రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానంలో కూడా కూర్చొన్నారు. సీఎం సీటులో కూర్చొని ఉన్నన్ని రోజులు కథ వేరేలా ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత ‘‘జై సమైఖ్యాంధ్ర’’ పేరుతో పార్టీ కూడా స్థాపించారు. వర్కవుట్ అవ్వకపోవడంతో మళ్లీ సొంతగూటికి చేరారు. పార్టీలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్‌గా లేని కిరణ్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరిపోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపో.. మాపో ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. పార్టీలో చేరిన తర్వాత పరిస్థితేంటి..? అసలు ఈయన ఏం ఆశించి బీజేపీలో చేరుతున్నారు..? ఈయన్నుంచి బీజేపీ ఏం ఆశిస్తోంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

బీజేపీ ఏం ఆశిస్తోంది..!?

కిరణ్‌రెడ్డి పాలనాపరంగా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఎమ్మెల్యే, స్పీకర్.. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అపార అనుభవం ఉంది. వైఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీలు రాజకీయాల్లోకి రాకముందే నల్లారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇందిరాగాంధీ హయాం నుంచి తెలుగు రాష్ట్రాల నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కటే అని కాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ.. లోని నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఇందులో కిరణ్‌రెడ్డికి అత్యంత ఆప్తులు కూడా ఉన్నారు. నేతలు పార్టీలు మారారు కానీ.. ఈయనతో టచ్‌లోనే ఉంటూ వస్తున్నారు. ఇందుకు ఈ మధ్య జరిగిన ఒకట్రెండు ఇంటర్వ్యూలు చూస్తే అర్థమవుతుంది. కిరణ్ బీజేపీలో చేరితే తెలుగురాష్ట్రాల్లో ఈయనకున్న అనుభవాన్ని వాడుకోవాలన్నదే కమలనాథుల మెయిన్ ప్లానట. అదెలాగంటే.. కిరణ్ రెడ్డితో కలిసి పనిచేసిన చాలా మంది సీనియర్లు, మేథావులు, కీలక నేతలంతా ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఈయన వచ్చీ రాగానే వారందరికి కాషాయ కండువా కప్పే పనిని అప్పగించబోతున్నారట. అంటే.. నాడు ఓ వెలుగు వెలిగిన నేతలంతా బీజేపీలో చేర్పించే కీలక బాధ్యతలు కిరణ్‌రెడ్డికి అప్పగించబోతున్నారన్న మాట. దీంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతలతో మంచి రాజకీయ పరిచయాలే కిరణ్‌కు ఉన్నాయి. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారట.

రాయలసీమ బాధ్యతలు..!

ఇక పార్టీ పరంగా వస్తే.. గ్రౌండ్ లెవల్‌ నుంచి ముఖ్యంగా రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడానికి ఈయన సేవలను బీజేపీ ఉపయోగించుకోబోతోందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం రాయలసీమ బీజేపీలో సరైన నాయకుడు లేరన్నది బీజేపీ భావనట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయన్ను ముందుపెట్టి రాయలసీమ మొత్తం రాజకీయం నడపాలని పార్టీ భావిస్తోందట. ఎందుకంటే.. సీమలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాబల్యం ఎక్కువ. పైగా ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌రెడ్డిని రాయలసీమ వరకు ఢీ కొనడానికి మరో రెడ్డి అయిన కిరణ్ మాత్రమే అందుకు సరైన వ్యక్తని బీజేపీ భావిస్తోందట. అంటే రెడ్డిని రెడ్డితోనే ఢీ కొట్టించబోతోందన్న మాట. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో బీజేపీకి సరైన నాయకత్వం లేదనేది ఢిల్లీ పెద్దల మాట. సరిగ్గా ఇదే సమయంలో కిరణ్‌రెడ్డినే బీజేపీ ‘ఆశాకిరణం’గా భావిస్తోందట. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గనుక పార్టీలో ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారని.. ముఖ్యంగా నేతల మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలుగుతారని బీజేపీ పెద్దలుగా గట్టిగా నమ్ముతున్నారట.

కిరణ్‌రెడ్డి ఏం ఆశిస్తున్నారు..?

వాస్తవానికి బీజేపీలో నిబద్ధతతో పనిచేసే నాయకులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆ పార్టీలో పనిచేసిన.. పనిచేస్తున్న పెద్దలు చెబుతున్న మాట. ఇందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. సీఎంగా పనిచేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టారు కానీ అట్టర్ ప్లాపే అయ్యింది. తర్వాత ఈయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఏడాది కిందట మళ్లీ కాంగ్రెస్‌లో చేరి కాస్త హడావుడి చేశారు కానీ.. ఈయన వ్యూహాలేమీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడున్న టీడీపీ, వైసీపీలో చేరాలని ఆయన భావిస్తే కచ్చితంగా రెడ్ కార్పెట్‌తోనే స్వాగతాలు వస్తాయి. జాతీయ పార్టీ నుంచి అదే రేంజ్‌ ఉన్న పార్టీలో చేరాలని కిరణ్‌రెడ్డి భావించే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈయనకు మంచి సిన్సియారిటీ ఉన్న వ్యక్తిగా, నమ్మినబంటుగా పేరుంది. అందుకే ఈయన్ను ఏరి కోరి మరీ కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో సీఎం సీట్లో కూర్చోబెట్టారన్నది అప్పట్లో కొందరు సన్నిహితులు చెప్పిన మాట. అందుకే అదే సిన్సియారిటీతో బీజేపీలో కూడా పనిచేస్తే కచ్చితంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని.. పార్టీకి కూడా కావాల్సింది అదేనని కిరణ్ రెడ్డి భావిస్తున్నారట. ఒకవేళ రాష్ట్రస్థాయిలో ఆశించిన రీతిలో పదవులు లేకపోయినా కేంద్రంలో మాత్రం కచ్చితంగా పెద్దలు పదవులు కట్టబెడతారని ఆశ మాత్రం ఉందట. అంటే కేంద్రంలో పదవులు అనుభవించి మునుపటి చరీష్మాతో ఓ వెలుగు వెలగాలని గట్టిగానే కిరణ్ కలలు కంటున్నారట.

మొత్తానికి చూస్తే.. బీజేపీకి కిరణ్ రెడ్డి అవసరం ఎంతుందో.. అంతకుమించి కిరణ్‌కు కూడా కమలం పార్టీతో అంతే అవసరం ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎవరు ఎవర్ని ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!


******************************

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!


******************************

TS BJP : తెలంగాణ బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయా.. బాబోయ్ ఈ రేంజ్‌లోనా..!



******************************

Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?


******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


*****************************

Updated Date - 2023-03-14T00:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising