Bride: పెళ్ళైన రెండోరోజే నాభార్య నగలతో సహా పారిపోయిందని పోలిస్ స్టేషన్లో వరుడి ఫిర్యాదు.. అసలు నిజం బయటపడటంతో..
ABN , First Publish Date - 2023-05-28T20:59:37+05:30 IST
అత్తారింటికి వెళ్ళిన రెండవ రోజే అమ్మాయి వరుడి ఇంటి నుండి మాయం అయింది. దీంతో నా భార్య డబ్బు నగలతో సహా పారిపోయిందంటూ నూతన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది.
స్నేహితులు, బంధుమిత్రుల మధ్య ఆ జంట వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వధూవరుల కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. వధువును కట్నకానుకలతో అత్తారింటికి పంపించారు అమ్మాయి తల్లిదండ్రులు. అయితే అత్తారింటికి వెళ్ళిన రెండవ రోజే అమ్మాయి వరుడి ఇంటి నుండి మాయం అయింది. దీంతో నా భార్య డబ్బు నగలతో సహా పారిపోయిందంటూ నూతన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బీహార్(Bihar) రాష్ట్రం భాగల్ పూర్ కు చెందిన నందలాల్ అనే వ్యక్తికి ముంగేర్ లోని బరియార్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మయితో మే 21వ తేదీన వివాహం జరిగింది. వివాహం అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు(bride parents) అమ్మాయిని కట్నకానులతో అత్తారింటికి(mother-in-law house) పంపించారు. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన రెండోరోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆమె పారిపోయింది. మరుసటిరోజు ఉదయం లేచిన అత్తింటి వారు ఆమె కోసం చూడగా ఆమె కనిపించలేదు. ఆమె కోసం ఇల్లంతా గాలించినా ఫలితం లేదు. వారు వెంటనే అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె గురించి అడిగారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వరుడికి(Groom) అమ్మాయి మీద అనుమానం వచ్చింది. అతను వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి 'నా భార్య నగలు, డబ్బు తీసుకుని పారిపోయింది' అంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె గురించి ఆమె కుటుంబ సభ్యులను విచారించారు.
Viral Video: బామ్మను బైక్ వెనుక సీటులో కూర్చోబెట్టుకుని యమా స్పీడ్ గా వెళ్తున్న పిల్లాడు.. పక్కనే వెళుతున్న కారు ప్రయాణీకుడికి ఊహించని షాక్..
పోలీసుల విచారణలో ఆమె మరొక వ్యక్తిని ప్రేమించినట్టు తెలిసింది. ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా నందలాల్ తో పెళ్లి జరిపించామని ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో వరుడి ఇంటి చుట్టుప్రక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల(CC Camera) ఆధారంగా ఆమె ఎటువైపు వెళ్ళిందో తెలుసుకుని ఆమెను వెతికి పట్టుకున్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె 'నాకు మా తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్ళి చేశారని వాపోయింది. 'డబ్బు, నగల గురించి నాకేమీ తెలియదు నేను వాటిని తీసుకెళ్ళలేదు' అని చెప్పుకొచ్చింది. విచారణ ముగిసిన తరువాత కోర్టు ఆమెకు అనుగుణంగానే తీర్పు ఇచ్చింది. ఆమె చిన్నపిల్ల కాదని నచ్చిన వ్యక్తితో కలసి జీవించే హక్కు ఆమెకు ఉందంటూ ఆమెకే మద్దతు ఇచ్చింది. ఆమె తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది.