Viral Video: యజమాని అడిగిన గణిత ప్రశ్నలకు.. ఈ కుక్క ఎలా సమాధానం చెబుతోందో చూడండి..
ABN , First Publish Date - 2023-11-11T21:44:41+05:30 IST
కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంగా ఉండడంతో పాటూ కొన్నిసార్లు చాలా తెలివిగా కూడా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కుక్కలు మనుషుల మాదిరిగానే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని మనుషులకు కనువిప్పు కలిగించే పనులు చేస్తూ అందరితో...
కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంగా ఉండడంతో పాటూ కొన్నిసార్లు చాలా తెలివిగా కూడా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కుక్కలు మనుషుల మాదిరిగానే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని మనుషులకు కనువిప్పు కలిగించే పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటాయి. ఇలాంటి తెలివైన కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెంపుడు కుక్క వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యజమాని అడిగిన గణిత ప్రశ్నలకు టకాటకా సమాధానాలు చెప్తున్న కుక్కను చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పెంపుడు (pet dog) కుక్కకు వింత పరీక్ష పెట్టింది. ఎదురుగా కూర్చోబెట్టుకుని కొన్ని తీసివేతలపై ప్రశ్నలు (maths questions) అడిగి.. కుక్క తెలివిని పరీక్షించింది. ముందుగా 7-5 కి ఆన్సర్ ఏంటని అడగ్గా.. వెంటనే 2 అని తన కాళ్లతో నేలకు రెండు సార్లు తట్టి చెబుతుంది. దీంతో ఆమె శభాష్ అంటూ కుక్కను మెచ్చుకుంటుంది. అలాగే వరుసగా.. 4-1, 8-2, 10-7 తీసివేతలకు సమాధానం అడగ్గా.. కుక్క చకాచకా సమాధానాలు చెప్పేసింది.
కుక్క తెలివికి సంబరపడిపోయిన మహిళ.. ముద్దు పెట్టుకుని అభినందిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి కుక్క ఇంట్లో ఉంటే పిల్లలకు ట్యూషన్ అక్కర్లేదేమో’’.. అంటూ మరికొందరు, ‘‘ఎక్కాలను భలే అప్పజెబుతోందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.