Share News

Viral: ఇప్పుడే వస్తానంటూ రెస్టారెంట్‌లో బాత్రూంకు వెళ్లిన ప్రియుడు.. ఎంతకూ బయటకు రాకపోవడంతో ఫోన్ చేసిన ప్రేయసికి..!

ABN , First Publish Date - 2023-10-19T13:50:03+05:30 IST

డేటింగ్ అంటూ యువతితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువకుడు.. మధ్యలోనే ఆమెను అదే రెస్టారెంట్‌లో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారణమేంటో తెలుసా? ఆమె అక్కడ తిన్న తిండి. అవును మీరు విన్నది నిజమే. ఆ తిండి తాలూకు బిల్లు భరించడం తన వల్ల కాదని భావించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Viral: ఇప్పుడే వస్తానంటూ రెస్టారెంట్‌లో బాత్రూంకు వెళ్లిన ప్రియుడు.. ఎంతకూ బయటకు రాకపోవడంతో ఫోన్ చేసిన ప్రేయసికి..!

Viral: డేటింగ్ అంటూ యువతితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువకుడు.. మధ్యలోనే ఆమెను అదే రెస్టారెంట్‌లో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారణమేంటో తెలుసా? ఆమె అక్కడ తిన్న తిండి. అవును మీరు విన్నది నిజమే. ఆ తిండి తాలూకు బిల్లు భరించడం తన వల్ల కాదని భావించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె తిండి ధ్యాసలో ఉండగా.. తాను బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయం తెలియని యువతి ప్లేట్ల మీదా ప్లేట్లు ఫుడ్ ఆర్డర్ చేస్తూ లాంగించడం చేసింది. ఇక బాత్రూం కంటూ వెళ్లిన ప్రియుడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఫోన్ చేసిన రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆమెకు అసలు విషయం బోదపడింది. గురుడు బిల్లు తడిసి మోపోడు అవుతుందని భావించి పలాయనం చిత్తగించాడనుకుంది. ఈ డేటింగ్ తాలూకు సంఘటనను ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో బయటకు రావడం, అది కాస్తా వైరల్‌గా మారడం జరిగింది.

Shocking: శ్రీకాంత్ సినిమా కథ.. అక్కడ నిజంగానే జరిగిందిగా.. పోలీసుల వల్లే ఓ వ్యక్తి చనిపోయినా.. శవాన్ని రోడ్డు పక్కన పడేసి..!


రోలింగ్ స్టోన్ ఈక్వానాబీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రకారం.. ఇటీవల ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. దాంతో వారి మధ్య చాటింగ్ మొదలైంది. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. ఇంకేముంది సమయం చూసి మనోడు ఆమెకి డేటింగ్‌ ప్రపొజ్ చేశాడు. దానికి రోలింగ్ స్టోన్ కూడా ఓకే చెప్పింది. ఆ సంతోషంలో మనోడు ఆమెతో కలిసి అట్లాంటాలోని ఫాంటైన్స్ ఓస్టర్ హౌస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ ప్రతి మంగళవారం గుల్లలు (Oysters)స్పెషల్ ఫుడ్ ఐటెం. పైగా వాటిపై ఆ రోజు ప్రత్యేక ఆఫర్ కూడా ఉంటుంది. డజన్ గుల్లలు 15 డాలర్లు. ఇక రోలింగ్ స్టోన్‌కు అవంటే చాలా ఇష్టం. ప్రియుడితో కలిసి ఫస్ట్‌టైమ్ రెస్టారెంట్‌కి వెళ్లిన ఆమె.. ఈ రోజు వాటిని ఓ పట్టుపట్టాలనుకుంది. వెంటనే ఓ ప్లేట్ ఆర్డర్ చేసింది. అతడు ఓ డ్రింగ్ ఆర్డర్ చేశాడు.

అలా రోలింగ్ ఆ ఒక్క ప్లేట్ గుల్లలతో ఆగలేదు. ఒక నాలుగు ప్లేట్ల వరకు లాంగించేసింది. అలాగే ఇతర ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసి తినడం చేసింది. చివరికి బిల్లు వచ్చే సమయానికి మనోడికి సీన్ అర్థమైంది. ఆమె తిన్న వాటికి బిల్లు చెల్లించడం అతనికి అంత ఈజీ కాదు అనిపించింది. వెంటనే తాను బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి, రెస్టారెంట్ నుంచి బయటకు జారుకున్నాడు. ఇక ప్రియుడు ఎంతకీ రాకపోవడంతో రోలింగ్ స్టోన్ అతనికి ఫోన్ చేసింది. కానీ, నో రెస్పాన్స్.

Shocking: ఏడుస్తూ ఇంటికొచ్చిన 7 ఏళ్ల కూతురు.. ఏమైందమ్మా అని ఒడిలో కూర్చోబెట్టుకుని అడిగితే.. ఆ పాప చెప్పింది విన్న తల్లికి..!

అప్పుడు ఆమెకు అసలు విషయం అర్థమైంది. బిల్లు కట్టలేక మనోడు జంప్ అని. ఈ ఘటన తాలూకు వీడియోతో సహా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అలా ఈ సంఘటన బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ పోస్టుకు 9.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 1.63లక్షల లైక్స్ వచ్చిపడ్డాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఒక్కసారి ఊహించుకోండి.. నాలుగు ప్లేట్ల గుల్లలు ఆర్డర్ చేసి, కేవలం 11 డాలర్ల టిప్పు ఇచ్చిందామె. క్రేజీ కదా' అని ఒకరు, 'నేను కూడా ఆమెను ఇలాగే మధ్యలోనే వదిలేస్తాను. ఎందుకంటే ఆమె స్వరం, ఆ తినే విధానం. బాబోయ్ నా వల్ల కాదు' అని మరోకరు కామెంట్ చేశారు.

Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!

Updated Date - 2023-10-19T13:55:30+05:30 IST