Sree leela: వీకెండ్.. ఎంజాయ్.. ఎక్కడికి వెళ్లిందంటే..
ABN , First Publish Date - 2023-03-05T19:53:08+05:30 IST
టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి జోరు మీదున్న కథానాయిక శ్రీలీల. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారామె! తాజాగా ఆమె మంచి మనసును చాటుకున్నారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి జోరు మీదున్న కథానాయిక శ్రీలీల (Sree leela) సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారామె! తాజాగా ఆమె మంచి మనసును చాటుకున్నారు. ‘హియర్ ఫర్ యు’ (Here For you) అనే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. వీకెండ్‌లో భాగంగా శనివారం ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడున్న చిన్నారులతో గడిపారు శ్రీలీల. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. (Sree leela Here for u social service)
‘‘వీలు కుదిరినప్పుడు ఇలాంటి చిన్నారులతో సమయాన్ని గడపండి. గొప్ప కలలు, గొప్ప మనసులతో ఉన్న నా చిన్నారులు. వాళ్లు ఎంత గొప్పవాళ్లో.. కలిసే వరకూ మీకూ తెలియదు. కలలు, కథలు, డ్యాన్స్, పాటలు, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం.. ఇలా ఈరోజు ఎంతో ఆనందంగా గడిచింది. వాళ్లందరికీ ప్రేమను పంచాలనే ఉద్దేశంతో అక్కడ అడుగుపెట్టాను. వాళ్ల అమాయకపు చూపులు బోసి నవ్వుల్లో నేను తడిసి ముద్దయ్యాను. ఇలాంటి క్షణాలను అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని నాకు తెలుసు. ప్రయత్నిస్తే అందరికీ సాధ్యమవుతుంది! ఇతరులకు సాయం చేయాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే, ఎలా చేయాలి? ఎవరికి సాయం చేయాలి? అనేది తెలియకపోవచ్చు. ఇప్పుడు అది మీ చేతిలోనే ఉంది. గూగుల్‌లో సెర్చ్ చేసి మీ చుట్టూ ఉన్న ఇలాంటి ఎంతోమంది చిన్నారులను మీరు కలుసుకోవచ్చు. ఈ పోస్ట్‌తో భారీ విరాళాలు ఇవ్వాలని నేను కోరడం లేదు. కానీ, మీ జీవితంలో ఎంతో విలువైన సమయం, ప్రేమ, ఆప్యాయతను ఇవ్వాలని కోరుతున్నా(Sree leela Orphan school visit). ఎవరూ లేని ఆ చిన్నారు ఇలాంటి చిన్న సరదాలనే కోరుకుంటారు. వారంలో ఒక రోజు, లేదా నెలకు ఒకసారైన వాళ్లతో కలిసి భోజనం చేయండి. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అది కేవలం కడుపు మాత్రమే నింపదు. ఆనందంతో హృదయం నిండిపోతుంది. అలాంటి మనసుతోనే ‘హియర్ ఫర్ యు’ ప్రారంభిస్తున్నా. ఏదైనా అనాథాశ్రమాన్ని మీరు సందర్శిేస్త.. ఆ ఫొటోలు తీసుకుని Here For you అనే ట్యాగ్ చేసి షేర్ చేయండి’’ అని శ్రీలీల పేర్కొన్నారు. దీనితో నెటిజన్ల మనసు దోచుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఆమెను అంతా మెచ్చుకుంటున్నారు.