Viral Video: పెంపుడు కుక్కను తీసుకుని పార్కుకు వెళ్తే షాకింగ్ అనుభవం.. ప్రాణభయంతో పరుగులు తీసిన మహిళ..!

ABN , First Publish Date - 2023-04-20T15:56:28+05:30 IST

నోయిడాలో ఓ మహిళపై (attack woman) శునకాలు వెంటాడి మరీ దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది.

Viral Video: పెంపుడు కుక్కను తీసుకుని పార్కుకు వెళ్తే షాకింగ్ అనుభవం.. ప్రాణభయంతో పరుగులు తీసిన మహిళ..!
Viral Video

జంతువుల్లో విశ్వాసం గల జంతువు ఏదంటే మొట్టమొదట చెప్పేది కుక్కనే. కుక్కలు అంత విశ్వాసంగా ఉంటాయి. అలాంటిది కుక్కలు ఎప్పుడైనా పగబట్టడం చూశారా? లేదంటే విన్నారా? వాటి పని అవి చూసుకుని వెళ్లిపోతుంటాయి. లేదంటే కొత్త వ్యక్తులను చూసి మొరుగుతుంటాయి. కానీ ఈ సీన్ చూశాక మాత్రం మీ అభిప్రాయం మారొచ్చు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు ఓ బాలుడిపై దాడి చేసి చంపేసిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆ దృశ్యాలు చూసిన వారంతా అయ్యో.. ఇంత దారుణమా? అంటూ భయాందోళన చెందారు. అలాగే జీహెచ్‌ఎంసీ తీరుపై కూడా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా నోయిడాలో జరిగిన పరిణామం చూస్తుంటే విస్తుగొల్పుతోంది.

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కుక్కల దాడితో గాయపడ్డవారు.. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరగడం భయాందోళన కలిగిస్తోంది. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడి కారణంగా ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. ఇటీవల యూపీలోని గుర్గావ్‌లో కూడా మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మరువక ముందే తాజాగా నోయిడాలో ఓ మహిళపై (attack woman) శునకాలు వెంటాడి మరీ దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది.

DKDK.jpg

నోయిడా (Noida) లోని సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలోని పార్కులో ఓ మహిళ తన పెంపుడు కుక్క (pet)తో నడుచుకుంటూ వెళ్తోంది. ఉన్నట్టుండి సడన్‌గా పెంపుడు కుక్కపై కొన్ని వీధికుక్కలు (Stray dogs) ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో కుక్కల బారినుంచి తప్పించుకునేందుకు పెంపుడు కుక్కను కాపాడుకుంటూనే.. చున్నీతో ఆ కుక్కలన్నింటినీ బెదరగొట్టే ప్రయత్నం చేసింది.. అయినా కూడా అవి విడిచిపెట్టకుండా అలానే దాడి చేసేందుకు ప్రయత్నం చేశాయి. దీంతో పెంపుడు కుక్కను భజాన వేసుకుని ప్రాణభయంతో పరిగెత్తడం ప్రారంభించింది.. అయినా కూడా అవి అలా వెంటపడుతూ టెన్షన్ పెట్టించాయి. ఎట్టకేలకు ఆ కుక్కలన్నింటినీ బెదరగొట్టి అక్కడ నుంచి తప్పించుకుంది. పరిగెత్తే క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

cdee.jpg

ఇది కూడా చదవండి: Husband: 11 బస్తాల్లో 10 రూపాయల నాణేలు.. నేరుగా కోర్టుకే తెచ్చిచ్చిన భార్యపై వెరైటీగా కసి తీర్చుకున్న భర్త..!

Updated Date - 2023-04-20T16:03:35+05:30 IST