Cricketer Married : ప్రేయసితో ఆసీస్ మహిళా క్రికెటర్ పెళ్లి
ABN , First Publish Date - 2023-04-15T03:43:20+05:30 IST
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జెస్ జొనాసెన్ తన ప్రియురాలు సారా వెర్న్‌ను మనువాడింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈనెల 6న హవాయి ద్వీపంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొంది.

సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జెస్ జొనాసెన్ తన ప్రియురాలు సారా వెర్న్‌ను మనువాడింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈనెల 6న హవాయి ద్వీపంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొంది. ఈ విషయాన్ని జొనాసెన్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఆసీస్ జట్టులో కీలక ఆల్‌రౌండరైన 30 ఏళ్ల జొనాసెన్ ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో సభ్యురాలు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన ఆసీస్ బృందంలోనూ సభ్యురాలైన ఆమె.. ఈ ఏడాది భారత్‌లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. కాగా.. మెగాన్ షట్, మరిజానె కాప్, అమీ సాటర్త్‌వైట్‌లాంటి పలువురు మహిళా స్టార్ క్రికెటర్లు ఇదివరకే తమ ప్రియురాళ్లను పెళ్లాడిన సంగతి తెలిసిందే.