Share News

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు..!!

ABN , First Publish Date - 2023-11-11T16:51:44+05:30 IST

Rishab Pant: గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో శిక్షణ పొందుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఆడతాడని తెలిపాడు.

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు..!!

గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఏడాది వరకు క్రికెట్ ఆడే అవకాశం లేదని గతంలో బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఐపీఎల్ 2023తో పాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు రిషబ్ పంత్ దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో శిక్షణ పొందుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఆడతాడని తెలిపాడు. కొద్దిరోజుల్లో ఐపీఎల్ 2024కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో నాలుగురోజుల ప్రాక్టీస్ క్యాంప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్వహించగా.. ఈ సన్నాహాక శిబిరానికి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, మెంటార్ గంగూలీ పాల్గొన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 12 వరకు పంత్ కోల్‌కతాలోనే ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పంత్ రెండు, మూడు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం టీమిండియాలోకి పంత్ వస్తాడని కూడా మీడియా వర్గాలు భావిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే రిషబ్ పంత్ వచ్చే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడు గాయపడటంతో ఈ ఏడాది జరిగిన లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథిగా వ్యవహరించాడు. అయితే డీసీ ప్రదర్శన అంతంత మాత్రంగానే సాగింది. నామమాత్రపు ప్రదర్శన కారణంగా చివరకు ప్లేఆఫ్స్‌‌కు చేరలేకపోయింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-11T16:51:46+05:30 IST