World Cup 2023: గిల్ స్థానంలో ఎవరు? హార్దిక్ ఆడకపోతే పరిస్థితేంటి? టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందంటే..?
ABN, First Publish Date - 2023-10-08T10:22:50+05:30
వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసం సాధించాలని పట్టుదలగా ఉంది.
చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసం సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు జట్టును అనారోగ్య సమస్యలు, గాయాలు కలవరపెడుతున్నాయి. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ సెషన్‌లో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిరంగా మారింది. ఈ నేపథ్యంలో మన ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండోతుందనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే గిల్ అనారోగ్యం గురించి బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోయినా తను ఈ మ్యాచ్ ఆడడం కష్టమే. అతడి స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు ఇషాన్ సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్ మరో ఆప్షన్‌గా కనిపిస్తున్నా.. కెప్టెన్ రోహిత్‌తో కలిసి కుడి, ఎడమచేతి కాంబినేషన్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆ తర్వాత నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్రస్తుత జట్టులో మ్యాచ్ వేదికైన చెన్నై చెపాక్‌లో సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కావడం విశేషం. ఫినిషర్‌గా హార్దిక్ ఉపయోగపడనున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్‌కు అయిన గాయం చిన్నదే అని తెలుస్తోంది. దీంతో అతను ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ హార్దిక్ దూరమైతే అతని స్థానంలో జట్టులోకి శార్దూల్ ఠాకూర్ లేదా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా ఉపయోగపడాతని సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకొవచ్చు. ఇక చెపాక్ పిచ్ స్వభావానికి అనుగుణంగా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తుది స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతోపాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా చోటు దక్కనుంది. అలాగే జడేజా, అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయగలరు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్‌గా వ్యవహరిస్తాడు. పైగా స్మిత్‌ను ఐదుసార్లు అవుట్ చేసిన అనుభవం హార్దిక్‌కు ఉంది.
టీమిండియా తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Updated Date - 2023-10-08T10:24:27+05:30 IST