ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ఏమి క్రేజ్ సామి ఇది.. 10 నిమిషాల్లోనే టికెట్లన్నీ ఖతం! కానీ IND vs PAK మ్యాచ్‌వి కాదు..

ABN, First Publish Date - 2023-08-31T21:27:22+05:30

మరో నెల రోజుల్లో మన దేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరో నెల రోజుల్లో మన దేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భారత్ ప్రయాణం అక్టోబర్ 8 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆసీస్‌తో పోరు కావడంతో మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో మ్యాచ్‌ను టీవీల్లోనే కాకుండా ప్రత్యక్షంగా మైదానంలో చూసేందుకు కూడా అభిమానులు ఆసక్తితో ఉన్నారు. అందుకోసం మ్యాచ్ టికెట్లు ఎప్పుడు పెడతారా? అని ఎదురు చూశారు.


దానికి అనుగుణంగానే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో పెట్టిన వెంటనే అభిమానులు టికెట్లన్నీ బుక్ చేసుకున్నారు. టికెట్ల మొత్తం ఇంత వేగంగా అమ్ముడవడం ఓ రికార్డుగా చెప్పుకొవచ్చు. దీనిని బట్టే చెప్పొచ్చు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో. నిజానికి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా మ్యాచ్‌లను మైదానాల్లో చూడడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. దానికి అనుగుణంగా టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతుంటాయి. ఇక ప్రపంచకప్ వంటి టోర్నీలోనైతే టీమిండియా మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎగబడుతారు. అయితే ఈ మ్యాచ్‌కే టికెట్లు ఇంత త్వరగా అమ్ముడైతే ఇక భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఎంత వేగంగా అమ్ముడతాయోనని పలువురు చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 14న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను కూడా త్వరలోనే ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. చూడాలి మరి ఆ మ్యాచ్ టికెట్లు ఎంత వేగంగా అమ్ముడవుతాయో.

Updated Date - 2023-08-31T21:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising