Virat Kohli: దూకుడు, కోపమే కాదు.. విరాట్ కోహ్లీలో ఈ కోణం కూడా ఉంది..
ABN , First Publish Date - 2023-05-03T09:03:04+05:30 IST
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే `కింగ్` కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. కోహ్లీ మంచి స్నేహితుడు. తన స్నేహితులెవరైనా కాస్త ఇబ్బందిలో ఉంటే కోహ్లీ వెంటనే స్పందిస్తాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే కింగ్
కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. కోహ్లీ మంచి స్నేహితుడు. తన స్నేహితులెవరైనా కాస్త ఇబ్బందిలో ఉంటే కోహ్లీ వెంటనే స్పందిస్తాడు. లఖ్‌నవూతో (LSGvsRCB) మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ దూకుడు బాగా హైలెట్ అయింది. గంభీర్, నవీనుల్ హక్‌లతో కోహ్లీ గొడవ బాగా చర్చనీయాంశం అయింది (Kohli Figtht with Gambhir).
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul hamstring injury) గాయపడిన సంగతి తెలిసిందే. మోకాలి గాయంతో రాహుల్ మైదానాన్ని వీడాడు. చివరి బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు. లఖ్‌నవూ ఆటగాళ్లతో గొడవపడి బాగా కోపంగా ఉన్న కోహ్లీ.. తన స్నేహితుడు రాహుల్‌ను పరామర్శించడం మాత్రం మర్చిపోలేదు. మైదానంలో రాహుల్‌తో గాయం గురించి కోహ్లీ మాట్లాడుతూ ధైర్యం చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే బెంగళూరు పేసర్ సిరాజ్ కూడా రాహుల్‌ను కౌగిలించుకుని మాట్లాడాడు.
Virat Kohli: గంభీర్‌పై రివేంజ్ తీర్చుకున్న విరాట్ కోహ్లీ.. మైదానంలో కోహ్లీ ప్రవర్తన చూడండి..!
బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. వెంటనే మైదానాన్ని వీడాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో 9వ వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు దిగాడు. నడవడం కూడా రాహుల్‌కు కష్టంగా మారింది. గాయం తీవ్రమైనది కావడంతో కొన్ని మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. ఆ మ్యాచ్‌లో లఖ్‌నవూ టీమ్‌కు కృనాల్ పాండ్యా (Krunal Pandya) నాయకత్వం వహించనున్నాడు.