ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:50 PM

మరో 4 నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్గుగా జరిగితే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.

మరో 4 నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్గుగా జరిగితే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. నిజానికి గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహిరస్తాడని అంతా భావిస్తున్నారు. భారీ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన రిషబ్ పంత్‌కు అప్పుడే కెప్టెన్సీ ఇచ్చి అధిక పని భారం పెట్టే ఆలోచనలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ లేదని తెలుస్తోంది. అందుకే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చి పంత్‌ను ఈ సీజన్ వరకు సాధారణ ఆటగాడిగా కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు జాతీయా మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.


పలు జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం ట్రేడింగ్ ద్వారా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను సంప్రదించిందని సమాచారం. కానీ ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ను ముంబై మేనేజ్‌మెంట్ తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తోంది. ట్రేడ్ విండో డిసెంబర్ 20 నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఐపీఎల్ వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను బదిలీ చేసుకోవడానికి ట్రేడ్ విండో ద్వారా ఫ్రాంచైజీలకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ ట్రేడ్ విండో ద్వారానే రోహిత్ శర్మను దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనదేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయినా రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులతోపాటు క్రీడా విశ్లేషకులు ముంబై మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising