షహీన్.. నెం.1
ABN , First Publish Date - 2023-11-02T04:01:21+05:30 IST
పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రీది వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు...

వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
కోల్‌కతా: పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రీది వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో షహీన్ ఏడు స్థానాలు ఎగబాకి 673 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న హాజెల్‌వుడ్ (663) రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. షహీన్ నెంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. సిరాజ్ (656) ఓ స్థానం కోల్పోయి మూడో స్థానంలో నిలిచాడు. బ్యాటర్లలో బాబర్ ఆజమ్ టాప్‌ర్యాంకు నిలబెట్టుకోగా.. గిల్, రోహిత్, కోహ్లీ వరుసగా 2, 5, 7 స్థానాల్లో ఉన్నారు.