Share News

మంత్రి సీతక్కకు స్వాగతం

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:00 AM

రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభా గం, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అన సూయ సీతక్క మంగళవారం రాత్రి సీసీసీ సింగ రేణి అతిథి గృహం వద్ద కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌ రాంనాధ్‌ కేకన్‌లు స్వాగతం పలికారు.

మంత్రి సీతక్కకు స్వాగతం

నస్పూర్‌, డిసెంబరు 27: రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభా గం, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అన సూయ సీతక్క మంగళవారం రాత్రి సీసీసీ సింగ రేణి అతిథి గృహం వద్ద కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ సుధీర్‌ రాంనాధ్‌ కేకన్‌లు స్వాగతం పలికారు. అర్ధరాత్రి సమయంలో నస్పూర్‌ గెస్ట్‌హౌజ్‌కు రోడ్డు మార్గం ద్వారా మంత్రి చేరుకున్నారు. కలెక్టర్‌, డీసీపీ లతోపాటు ఆర్డీవో రాములు, తహసీల్దార్‌ వనజా, సీపీ సంజీవ్‌. ఎస్‌ఐ రవికుమార్‌లు మంత్రి సీత క్కకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌, డీసీ పీలతో మంత్రి జిల్లా విషయాలను అడిగి తెలుసు కున్నారు. బుఽధవారం ఉదయం పలువురు యూని యన్ల నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రాలు అందించారు. ఇక్కడ నుంచి ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాల సమావేశానికి వెళ్ళారు.

మంత్రిని సన్మానించిన ఎమ్మెల్యే

మందమర్రిటౌన్‌: మంత్రి సీతక్కను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన సీతక్క ఎమ్మెల్యే నివాసంలో స్వాగ తం పలికి సన్మానించారు. జిల్లాకు సంబంధించిన సమస్యలను విన్నవించానని ఎమ్మెల్యే తెలిపారు. గుడ్ల రమేష్‌, సదానందంయాదవ్‌ పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేయాలి

ఏసీసీ: మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మ నెంటు చేయాలని సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హరికృష్ణ మంత్రి దనసరి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద నివాసానికి వచ్చిన మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మనెం టు చేసే వరకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వా లని, విధి నిర్వ హణలో మరణించిన వారికి రూ.5 లక్షల బీమా కల్పించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ, ఇంక్రిమెంటు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని కోరారు.

Updated Date - Dec 28 , 2023 | 12:00 AM