Share News

Ponguleti Srinivasreddy: కాంగ్రెస్ చెప్పిన టైమ్‌లో ఇవ్వకుండా మాపై అబద్దాలా?.. రైతుబంధుపై పొంగులేటి

ABN , First Publish Date - 2023-11-28T10:55:27+05:30 IST

Telangana Elections: ఎన్నికల లబ్ది కోసం రైతుబంధుని వారి అకౌంట్‌లో వేసే కార్యక్రమం చేపట్టాలని కుట్రలతో బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. అక్టోబర్ 26నాడే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ విన్నపం ఇచ్చిందని చెప్పారు.

Ponguleti Srinivasreddy: కాంగ్రెస్ చెప్పిన టైమ్‌లో ఇవ్వకుండా మాపై అబద్దాలా?.. రైతుబంధుపై పొంగులేటి

ఖమ్మం: ఎన్నికల లబ్ది కోసం రైతుబంధుని వారి అకౌంట్‌లో వేసే కార్యక్రమం చేపట్టాలని కుట్రలతో బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) నిర్ణయం తీసుకుందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Congress Candidate Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. అక్టోబర్ 26నాడే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ విన్నపం ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఇవ్వమని లేదా డిసెంబర్ ఒకటి తర్వాత ఇవ్వమని ఆనాడే కాంగ్రెస్ లెటర్ ఇచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన టైమ్‌లో ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఆపింది అని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు, రైతులు గమనించాలన్నారు.


ప్రజల దీవెనలతో డిసెంబర్ 11న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని అన్నారు. ఇవన్నీ రావాలి, కావాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొత్తగూడెంలో కూనంనేనిని గెలిపించడానికి తన శక్తినంతా దారపోస్తున్నానన్నారు. కూనంనేని కొత్తగూడెంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. హస్తం గుర్తుపై ఓటేసి తనను మంచి మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినతి చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T10:55:28+05:30 IST