Share News

Lakshman : కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించింది

ABN , First Publish Date - 2023-11-03T17:09:13+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వం ( KCR Govt ) పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించిందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

Lakshman : కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించింది

ఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వం ( KCR Govt ) పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించిందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారంలో బుంగ పడింది. నదులకే నడకలు నేర్పిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రులు పొగిడారు. పూర్తి నిర్లక్ష్యంగా డ్యామును నిర్మించారని డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదికలో పేర్కొంది. నివేదికలో డ్యామ్‌ను పూర్తిగా పునాది స్థాయి నుంచి తిరిగి నిర్మించాలని డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు సూచించారు. బ్యారేజీ కట్టడం వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని కమిటీ నివేదికలో తెలిపింది. కమిటీ కోరిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం 20లో 11 మాత్రమే ఇవ్వడం.. మిగతావి ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాలతో మేడిగడ్డ బ్యారేజ్ ముడిపడి ఉంది. 35 వేల కోట్లతో ఉన్న వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లకు నిర్మాణం వ్యయం పెంచారు’’ అని లక్ష్మణ్ మండిపడ్డారు.

కేంద్రంపై విమర్శలు చేశారు: లక్ష్మణ్

‘‘కాళేశ్వరంతో లక్ష ఎకరాల పంటకు నీరందిస్తామని కేసీఆర్ వారి మంత్రులు చెప్పారు. డ్యాం కు ఏమైనా జరిగితే కట్టిన సంస్థనే బాధ్యత భరిస్తుంది అని గతంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదని గతంలో కేంద్ర ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అన్నారం, సుందర్ల బ్యారేజ్‌ల ఇదే పరిస్థితిని ఎదుర్కొనే సమస్య ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు ఉపయోగించే అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నారు. ప్లానింగ్, డిజైన్ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రీ డిజైన్ పేరు మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పేరు తెర మీదకు తీసుకొచ్చారు. మూడేళ్లలోనే కాళేశ్వరం అవినీతి కలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇరిగేషన్ మంత్రి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ముందు తన చెంపలు వాయించుకోవాలి’’ అని లక్ష్మణ్ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-03T17:09:18+05:30 IST