Harish Rao : కాంగ్రెస్‌ని ఈ ఎన్నికల్లో నమ్మితే రిస్క్‌లో పడుతాం
ABN , First Publish Date - 2023-11-24T21:51:52+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మితే రిస్క్‌లో పడుతామని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు.

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మితే రిస్క్‌లో పడుతామని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు నంగునూర్ మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ...‘‘నంగునూర్ రూపు రేఖలు ఎంతగానో మారాయి.డిసెంబర్ 3వ తేదీ తర్వాత ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం. కాంగ్రెస్ హయాంలో కరువు ఉంటే నేడు కైకిల్లోల్లు దొరకని పరిస్థితి ఉన్నది. ప్రజల ఆరోగ్యమే నా ఆరోగ్యం. ప్రతి ఒక్కరినీ ఓటు అడగాలి, ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిప్పి కొట్టాలి. కారు గెలిస్తెనే బతుకు లేకుంటే మూడు గంటల కరెంట్ వస్తుందని ప్రజలకు చెప్పాలి. అన్ని గెలిస్తేనే కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటేనే మనం ఉంటాం. ఈ ఎన్నికల్లో రిస్క్ పడితే మోసపోతం.. రిస్క్ వద్దు కారుకు ఓటు వేయాలి’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.