Share News

Tinmar Mallanna: కేసీఆర్ తిన్నవి కక్కిస్తే.. 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు

ABN , First Publish Date - 2023-11-28T12:55:11+05:30 IST

Telangana Elections: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు.

Tinmar Mallanna: కేసీఆర్ తిన్నవి కక్కిస్తే.. 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు

సిద్దిపేట జిల్లా: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి (Congress Candidate Kommuri Prathap Reddy) మద్దతుగా తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై (BRS Candidate Palla Rajeshwar Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి కరువైన్నట్టు స్థానికేతారుడికి అప్పగించారని మండిపడ్డారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనపై ఎమ్మెల్సీగా పల్లా గెలిచారన్నారు. గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్, సిరిసిల్ల లో కేటీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని అన్నారు. ప్రజల సొమ్ము దోచి పథకాలు అమలు చేస్తున్న పెద్ద దొంగ కేసీఆర్ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వందశాతం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతుబంధు కాంగ్రెస్ ఆపితే ఇల్లు, స్కూల్ నిర్మాణాలు ఎవరు ఆపారని ఆయన ప్రశ్నించారు.


కేసీఆర్ వైన్స్‌ల కోసం ముందే టెండర్ వేశారని.. మరి రైతుబంధు ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ ముందట పడలేదని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లో అందరూ ఉద్యోగులే అని మరి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగలు ఏమయే అని అడిగారు. రేషన్ కార్డులను ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. తొలగించే కేసీఆర్ కావాలా ఆలోచించాలన్నారు. నిజాం నిరంకుశ పాలనలో బైరన్‌పల్లిలో మహిళలను వివస్త్రాలు చేసిన ఘటన జనగమలో పల్లా గెలుస్తే పునరావృతం అవుతుందన్నారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తానని పల్లా తిరుగుతున్నారని...డబ్బు తీసుకుని.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. నోట్లు.. పల్లావి, ప్రమాణాలు తీన్మార్ మల్లన్న మీద... ఓట్లు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వేయాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తేనాని అమిత్ షా చెబుతున్నారన్నారు. కవిత వైన్స్ దందా చేస్తే... అమిత్ షా వద్దకు వెళ్ళి సీఎం కేసీఆర్ బిడ్డను కాపాడుకున్నారన్నారు. 6 లక్షల కోట్లు కేసీఆర్ తిన్నవి కక్కిస్తే... కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయొచ్చు అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T12:55:12+05:30 IST