Rains lash Telangana : ఐటీ కంపెనీలకు ముఖ్య గమనిక.. ఈ మూడు పాటించాల్సిందే..! | Cyberabad Police Dept Alerts Hyderabad Software Companies Amid Rain Lashes In Telangana Nag

Rains lash Telangana : ఐటీ కంపెనీలకు ముఖ్య గమనిక.. ఈ మూడు పాటించాల్సిందే..!

ABN , First Publish Date - 2023-07-25T17:38:56+05:30 IST

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) కాస్త ‘హైజలాబాద్’గా మారిపోయింది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.! ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్‌లో (IT Corridor) భారీ ట్రాఫిక్ జామ్‌ (Traffic Jam) ఏర్పడింది...

Rains lash Telangana : ఐటీ కంపెనీలకు ముఖ్య గమనిక.. ఈ మూడు పాటించాల్సిందే..!

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) కాస్త ‘హైజలాబాద్’గా మారిపోయింది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.! ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్‌లో (IT Corridor) భారీ ట్రాఫిక్ జామ్‌ (Traffic Jam) ఏర్పడింది. ఈ కారిడార్‌లో వాటర్​లాగింగ్ పాయింట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఐటీ ఉద్యోగులు (IT Employees), స్టూడెంట్లు, ఆఫీసులు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్ కావడంతో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఐటీ కారిడార్‌లోని అన్నీ మెయిన్​ రోడ్లు వెహికల్స్‌తో నిండిపోయాయి. ఒక్క కిలోమీటరు దూరానికి దాదాపు గంటకుపైగా టైమ్ పట్టిందని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇది హైదరాబాదేనా..? లేకుంటే మరేదైనా దేశమా..? అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని సైబరాబాద్ పోలీస్ శాఖ (Cyberabad Police) కీలక నిర్ణయం తీసుకుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Traffic.jpg

మూడు ఫేజ్‌లుగా..!

వర్షాల కారణంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఫేజ్ 01 : ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్ 02 : ఐకియా నుంచి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్ 03 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి అని సైబరాబాద్ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏయే ఫేజ్ కిందికి.. ఏ కంపెనీలో వస్తాయో లుక్కేయండి..

IT-Companies.jpg

Updated Date - 2023-07-25T17:45:15+05:30 IST