తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ..

ABN , First Publish Date - 2023-06-21T14:50:45+05:30 IST

న్యూఢిల్లీ: తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసారు.

తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ..

న్యూఢిల్లీ: తెలంగాణ (Telangana)లో తెరపైకి మరో రాజకీయ పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) నేతృత్వంలో ‘గద్దర్ ప్రజా పార్టీ’ (Gaddar Praja Party) పేరుతో కొత్త రాజకీయ పార్టీని (New Political Party) ఏర్పాటు చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) అధికారులను కలిసారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తికానుంది. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగా తాను ఉన్నప్పుడు కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పనని, తాను ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని, పుచ్చి పోయిన తెలంగాణ చేశారని విమర్శించారు.

కేసీఆర్ విధానాలు తప్పు...

సీఎం కేసీఆర్ (CM KCR) విధానాలు తప్పని.. ధరణి పేరుతో ముఖ్యమంత్రి భూములు మింగారని గద్దర్ ఆరోపించారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదని, దొరల పరిపాలన జరుగుతోందని విమర్శించారు. 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టానన్నారు. భారత రాజ్యాంగం తీసుకుని ఓట్ల యుద్ధానికి సిద్దం కావాలని పిలుపిచ్చారు. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానన్నారు. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరానని, ఇది శాంతి యుద్ధం...ఓట్ల యుద్ధమని, పార్టీ నిర్మాణం కోసం గ్రామ గ్రామానికి వెళ్తానని స్పష్టం చేశారు. సచ్చే ముందు సత్యమే చెపుతున్నానని, తాను భావ విప్లవకారుడినని, అయిదేళ్ళు అడవిలో ఉన్నానని చెప్పారు. ప్రజలకు స్వేచ్ఛ... నీరు... ఉద్యోగాలు... కావాలని గద్దర్ అన్నారు. కాగా అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసేముందు ఏపీ, తెలంగాణ భవన్‌లోని గద్దర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-21T14:50:45+05:30 IST