Marri Shashidhar Reddy: మైనారిటీలను మోసం చేసేందుకు లక్ష సాయం
ABN , First Publish Date - 2023-07-24T18:09:55+05:30 IST
ఎన్నికల్లో ఓట్ల కోసమే మైనారిటీలకు ఆర్థిక సాయం జీవో. ప్రభుత్వ జీవోలు తేదీలు ఎందుకు ప్రకటించలేదు?, ప్రభుత్వ జీవోపై ఎన్నికల కమిషన్‌కు మేం ఫిర్యాదు చేస్తాం. గతంలో ఇచ్చిన అప్లికేషన్‌లను కనీసం పరిశీలించలేదు. రెండున్నర లక్షల అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

హైదరాబాద్: మైనారిటీలను మోసం చేసేందుకు కేసీఆర్ (CM KCR) సిద్దమయ్యారని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Shashidhar Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసమే మైనారిటీలకు ఆర్థిక సాయం జీవో. ప్రభుత్వ జీవోలు తేదీలు ఎందుకు ప్రకటించలేదు?, ప్రభుత్వ జీవోపై ఎన్నికల కమిషన్‌కు మేం ఫిర్యాదు చేస్తాం. గతంలో ఇచ్చిన అప్లికేషన్‌లను కనీసం పరిశీలించలేదు. రెండున్నర లక్షల అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అప్లికేషన్ల పేరుతో ధరఖాస్తులపై ఒక్కొక్కరి నుంచి రూ.2500 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు ఆర్థిక సాయం చేస్తే క్రిస్టియన్, బుద్ధిష్ట్, సిక్ వంటి మైనారిటీలకు ఎందుకు ఇవ్వరు? నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్ల వయసు 57 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు? ఏమైంది?, కేంద్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అందరికీ సాయం చేస్తూ వస్తోంది. పస్మందా ముస్లింలకు బీజేపీ సాయం చేస్తోంది.’’ అని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.