TS News: గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీస్ బలగాల మోహరింపు
ABN , First Publish Date - 2023-05-05T13:00:42+05:30 IST
గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్: గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీభవన్ ముందు భారీగా పోలీసు బలగాలు మోహరించారు. కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బజరంగ్‌దళ్ సభ్యులు భగ్గుమంటున్నారు. ఈరోజు గాంధీభవన్ ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని పిలుపునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. దాంతో ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. గాంధీభవన్‌కు రెండు వైపుల ఉన్న గేట్లను బారికేడ్లతో మూసివేశారు.
గాంధీభవన్‌లో వరుస సమావేశాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీభవన్ ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ లోపలికీ ఎవరినీ అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని లోనికి అనుమతించారు. కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బజరంగ్‌దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బజరంగ్‌దళ్, బీజేపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌కు రానున్నారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.