TS NEWS: హుస్సేన్ సాగర్ నాలాలో పడి మహిళ గల్లంతు.. మూసిని జల్లెడ పట్టిన డీఆర్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2023-09-04T16:29:01+05:30 IST

గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. వర్షాలతో ప్రజలు ఇబ్బందిపడతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ సిటీ అంతా అస్తవ్యస్తంగా మారింది.

TS NEWS: హుస్సేన్ సాగర్ నాలాలో పడి మహిళ గల్లంతు.. మూసిని జల్లెడ పట్టిన డీఆర్‌ఎఫ్‌

హైదరాబాద్‌ : గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. వర్షాలతో ప్రజలు ఇబ్బందిపడతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ సిటీ అంతా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జాంలు అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్(Gandhi Nagar Police Station) పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని హుస్సేన్ సాగర్ నాలాలో(Hussain Sagar Nala) పడి లక్ష్మీ అనే మహిళ గల్లంతయ్యింది. సంజీవయ్య నగర్‌(Sanjivaiah Nagar)లో ఉండే లక్ష్మి (55) నాలాపై ఇల్లు నిర్మించుకుంది.

ఇటీవల వర్షానికి ఇంటి గోడ కూలిపోగా.. ఈ రోజు ఉదయం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఆమె నాలాలో పడి కొట్టుకుపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన లక్ష్మి ఆ తర్వాత కనిపించకండా పోయింది. నాలా దగ్గర లక్ష్మి చేతి గాజులను ఆమె కూతుర్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌(GHMC, DRF) అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి మూసీ నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొని మూసీని జల్లెడ పడుతున్నారు. అయితే ఆమె నాలాలో పడి గల్లంతయ్యిందా? లేక ఎక్కిడైకినా వెళ్లిందా? తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-09-04T16:29:01+05:30 IST