ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyavati Rathod: ‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోండి.. మీకూ కుటుంబం ఉంది’

ABN, First Publish Date - 2023-03-11T15:11:00+05:30

బీజేపీ నేత బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: బీజేపీ నేత బండి సంజయ్‌ (BJP Leader Bandi Sanjay)పై మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కవిత(BRS MLC Kavitha)పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయని తెలిపారు. బండి సంజయ్ రాజకీయ విలువలేని వ్యక్తి అని విమర్శించారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఉండడం దురదృష్టకరమన్నారు. జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో కవిత ఒక భూమిక ప్రదర్శించారని తెలిపారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోతారన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక బీజేపీ వైఖరా చెప్పాలన్నారు. బండి సంజయ్ కళ్ళకు కామర్లు వచ్చి దేశమంతా ఆయనకు బీజేపీ కనిపిస్తుందని మంత్రి యెద్దేవా చేశారు.

గిరిజన ప్రతినిధిగా 50 శాతం పంచాయితీల్లో కేసీఆర్ (CM KCR) రిజర్వేషన్ కలిపించారన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళా సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బీజేపీకి పాతాళంలోకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసులకు భయపడేది లేదని, ఎవరిపైన ఏ కేసులు పెడుతున్నారు భారతదేశ ప్రజలందరికీ తెలుసన్నారు. మోదీ అంటే ఆదాని అని అందరికీ తెలుసని అన్నారు. దొంగ స్వామీజీలు హైదరాబాద్‌లో పట్టపగలు పట్టుబడితే కేసులు ఉండవని మండిపడ్డారు. బండి సంజయ్‌కి సిగ్గుండాలన్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 100 సీట్లలో డిపాజిట్లు రాలేదన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. ఆయనకు కుటుంబం ఉందని అన్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సమాజం ఊరుకోదని హెచ్చరించారు. బండి సంజయ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని.. బహిష్కరించాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-11T15:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising