CM KCR: ‘ఆ లయకారుని దీవెనెలతో అందరి జీవితాలు వర్ధిల్లాలి’

ABN , First Publish Date - 2023-02-18T12:08:20+05:30 IST

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR: ‘ఆ లయకారుని దీవెనెలతో అందరి జీవితాలు వర్ధిల్లాలి’

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం (MahaShivratri) సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Telangana CM K Chandrashekar Rao) శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి (Shivratri) రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని సీఎం (Telangana CM)అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని సీఎం ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ (CM KCR) ఆకాంక్షించారు.

మరోవైపు మహాశిరాత్రిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం (Telangana State) లోని అనేక దేవాలయాలు (Lord Shiva Temples) భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Rajanna Temple), వేయిస్తంభాల గుడి (Thousand pillared temple), రామప్ప ఆలయం (Ramappa Temple), ఏడుపాయల వనదుర్గామాత (Edupayala Vanadurgamata Temple) తదితర ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. శంభో శంకరా అంటూ భక్తిశ్రద్ధలతో మహాదేవుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో మహాశివరాత్రి జాతర (MahaShivratri Jatara) వైభవంగా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Updated Date - 2023-02-18T12:08:21+05:30 IST