US consulate: బేగంపేట్‌లోని యూఎస్ కాన్సులేట్ మారలేదు
ABN , First Publish Date - 2023-01-12T20:28:31+05:30 IST
ఇంతకాలం బేగంపేట్ కేంద్రంగా సేవలు అందించిన యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను (US Visa Application Centre) మాధాపూర్‌లోని హైటెక్-సిటీ(Hi-Tech city) మెట్రో స్టేషన్‌కి తరలించినట్టు యూఎస్ కాన్సులేట్ (US Consulate) వెల్లడించింది.
హైదరాబాద్: ఇంతకాలం బేగంపేట్ కేంద్రంగా సేవలు అందించిన యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను (US Visa Application Centre) మాధాపూర్‌లోని హైటెక్-సిటీ(Hi-Tech city) మెట్రో స్టేషన్‌కి తరలించినట్టు యూఎస్ కాన్సులేట్ (US Consulate) వెల్లడించింది. బయోమెట్రిక్ వీసా అపాయింట్‌మెంట్లు, ధృవీకరణ పత్రాల సమర్పణ, పాస్‌పోర్ట్ సేకరణ (Passport) ఇకపై కొత్త కేంద్రంలోనే అందనున్నాయని వెల్లడించింది. అయితే ఇంటర్వ్యూలు మాత్రం బేగంపేట్‌లోని యూఎస్ కాన్సులేట్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల కోసం వచ్చేవారు బేగంపేట్ రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 6న యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ఆఫీషియల్ ట్విటర్ పేజీ క్లారిటీ ఇచ్చింది.
‘‘ హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ మారలేదు. వీసా ఇంటర్వ్యూ కోసం బేగంపేట్‌లోని కాన్సులేట్ రండి. వీసా అప్లికేషన్ సెంటర్ (VAC) మాధాపూర్‌లోని హైటెక్ మెట్రో స్టేషన్‌కి తరలించబడింది. అయినప్పటికీ ఇంటర్వ్యూలు మాత్రం బేగంపేట్‌లోని కాన్సులేట్‌లో జరుగుతాయి’’ అని తెలిపింది. బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్స్, ఐడబ్ల్యూ సబ్‌మిషన్స్, పాస్‌పోర్ట్ సేకరణ సేవల కోసం వీసా అప్లికేషన్ సెంటర్‌ను ఉపయోగిస్తారని, వీఏసీని జనవరి 8న తరలిస్తామని తెలుపుతూ జనవరి 6న యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ట్వీట్ చేసింది.