కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-06-24T00:29:28+05:30 IST

కట్టంగూరు నుంచి అంబేడ్కర్‌నగర్‌, అంబటివాగుకు వెళ్లే దారిలో ఉన్న వాగులపై బ్రిడ్జీల నిర్మాణానికి ఎమ్మెల్యే లింగయ్య రూ.4కోట్ల నిధు లు మంజూరు చేయించడంపై అంబేడ్కర్‌నగర్‌కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కట్టంగూరు, జూన 23: కట్టంగూరు నుంచి అంబేడ్కర్‌నగర్‌, అంబటివాగుకు వెళ్లే దారిలో ఉన్న వాగులపై బ్రిడ్జీల నిర్మాణానికి ఎమ్మెల్యే లింగయ్య రూ.4కోట్ల నిధు లు మంజూరు చేయించడంపై అంబేడ్కర్‌నగర్‌కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రు లు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిత్రపటాలకు శుక్రవారం కట్టంగూరులో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వాగుపై రెండుచోట్ల వంతెన లేకపోవడం వల్ల కొ న్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యే లింగయ్య నిధులు మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బ లరాం, పార్టీ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండ లు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన పోగుల నర్సింహ, నాయకులు చెవుగోని జనార్థన, అంతటి శ్రీను, రెడ్డిపల్లి మనోహర్‌, మునుగోటి ఉత్తరయ్య, నిమ్మల సత్యనారాయ ణ, పెద్ది బాలనర్సింహ, మేడి వెంకన్న, మేకల రమేష్‌, జనార్థన, రాములు, సాయి, అంజయ్య, లింగయ్య, సైదు లు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-24T00:29:28+05:30 IST