ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padayatra: రేవంత్‌ పాదయాత్రలో వీహెచ్...

ABN, First Publish Date - 2023-02-14T10:51:05+05:30

రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ‘‘హాత్ సే హాత్’’ జోడో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం: రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేపట్టిన ‘‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’’పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర (Revanth Reddy Padayatra) చేయనున్నారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు (Congress Leader Revanth Reddy)... రేవంత్ పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు. రేవంత్‌ (Revanth Reddy)తో కలిసి రెండు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు భద్రాచలం (Bhadrachalam)లో, రేపు పాలకుర్తి (Palakurthi) జరుగుతున్న పాదయాత్రలో వీహెచ్ పాల్గొననున్నారు. భారత్ జోడో యాత్ర (Bharath Jodo Yatra) కొనసాగింపుగా జరుగుతున్న ‘‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’’ యాత్రలో రెండు రోజుల పాటు పాల్గొననున్నట్టు హనుమంతరావు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం భద్రాచలంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batti Vikramarka)తో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని, రేపు పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొననున్నట్లు వీహెచ్ తెలిపారు.

పాలకుర్తిలో టెన్షన్... టెన్షన్

మరోవైపు ఈరోజు పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) పాదయాత్ర నేడు పాలకుర్తిలోకి ప్రవేశించనుంది. రేపు, ఎల్లుండి పాలకుర్తిలో రేవంత్, షర్మిల పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఇద్దరు కీలక నేతల పాదయాత్రలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. పాలకుర్తిలో భారీగా మోహరించిన పోలీసులు... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay)పాదయాత్ర సందర్భంగా రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీజేపీ, బీఆర్ఎస్ (BJP, BRS) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. బండి సంజయ్ నాడు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అది అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతల (BRS Leaders)కు మింగుడు పడలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్‌కు అడుగడునా అడ్డు తగిలారు. మళ్లీ ఇలాంటి ఘటనలు ఇప్పుడు పునరావృత్తం అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Updated Date - 2023-02-14T10:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising