Minister Puvvada: ఇదీ తెలంగాణలో విపక్షాల పరిస్థితి
ABN, First Publish Date - 2023-04-24T13:55:35+05:30
రాష్ట్రంలో విపక్ష నేతలపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఖమ్మం: రాష్ట్రంలో విపక్ష నేతలపై మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని కల్లూరులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయసమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ... ‘‘కేంద్రమంత్రి అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సెక్రటేరియట్ డూమ్‌లు కూల్చివేస్తామంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌లో బాంబులు పెడుతామన్నారు. షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తున్నారు... డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులకు దిగుతున్నారు’’ అని, ఇదీ తెలంగాణలో విపక్షాల పరిస్థితి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం మొత్తానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశానికే రోల్ మోడల్‌గా నిలచిందని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికలలలో ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు పదికి పది గెలుచుకుంటామమని మంత్రి పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-24T13:55:35+05:30 IST