ముగ్గు.. మనోహరం
ABN , First Publish Date - 2023-01-09T00:35:14+05:30 IST
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్, టాటాటీ జెమినీ సంయుక్తంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
పాల్వంచలో మొదటి బహుమతి గెలుచుకున్న ముగ్గు, విజేత దాసరి మల్లీశ్వరి
ఖమ్మంలో మాట్లాడుతున్న మేయర్ నీరజ, చిత్రంలో డిప్యూటీమేయర్ ఫాతిమా జోహార, బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, తదితరులు
పాల్వంచలో బహుమతి అందజేస్తున్న అనుబోస్ విద్యాసంస్థల వైస్‌చైర్‌పర్సన్ అవని, చైర్మన్ భరతకృష్ణ, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ రామారావు
ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ముగ్గుల పోటీకి హాజరైన మహిళలు
పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో మగ్గులు వేస్తున్న మహిళలు
ఉత్సాహంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ఖమ్మం, పాల్వంచ కేంద్రాల్లో నిర్వహణ
మహిళల నుంచి విశేష స్పందన
ఖమ్మం సాంస్కృతికం/పాల్వంచ, జనవరి 8: ఆంధ్రజ్యోతి- ఏబీఎన్, టాటాటీ జెమినీ సంయుక్తంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రస్థాయిలో గార్డెనింగ్ పార్టనర్‌గా క్రాఫ్ట్‌వారి పర్ఫెక్ట్, ప్రాగ్రెన్స పార్టనర్‌గా బెట్కోవారి అన్నమయ్య అగరొత్తులు, హెల్త్‌పార్టనర్‌గా అమృతబిందు, ఫ్యాషన పార్టనర్‌గా డిగ్‌సెల్, సెల్సియా వ్యవహరించిన ఈ పోటీలకు ఖమ్మం జిల్లా స్థాయిలో శ్రీబాలాజీ ఎస్టేట్స్ అండ్ కనస్టక్షన్స, భద్రాద్రి జిల్లా స్థాయిలో అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల వారు స్థానిక స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీతో సంక్రాం తి పండుగ ముందే వచ్చినట్టుందన్నారు. మరుగునపడుతున్న సంస్కృతి సంపద్రాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ పోటీల నిర్వహణకు కృషి చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా మాట్లాడుతూ ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని, కొందరు మహిళలు సామాజికచైతన్యం కలిగించేలా ముగ్గులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. శ్రీబాలాజీ రియల్ ఎస్టేట్స్, అండ్ కనస్ట్రక్షన్స అధినేత వత్సవాయి రవి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అందరిపై ఉందని, అలాంటి సత్సంకల్పానికి పూనుకున్న ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకు తన సహకారం ఎప్పడూ ఉంటుందన్నారు. ఆధునిక పోకడలతో, సోషల్‌మీడియా మోజులో పడి యువత సంస్కృతి, సంప్రదాయాకు దూరమవుతోందని, ఇలాంటి కార్యక్రమాలతో భవిష్యత తరాలకు మన సంస్కృతిని అందించినవారమవుతామన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్ మేనేజర్ తాళ్లూరి పుల్లారావు, బ్యూరో ఇన్‌చార్జ్ నలజాల వెంకట్రావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహిస్తోందని, మహిళల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిషన ఇన్‌చార్జ్ కొల్లు రాజేష్, డెస్క్ ఇన్‌చార్జ్ బి.రామాంజనేయులు, యాడ్స్ మేనేజర్ మానప్రగడ రమేష్, సర్క్యులేషన్ మేనేజర్ మొగలపు వెంకటసూర్యనారాయణ, ‘ఆంధ్రజ్యోతి’ ఖమ్మం స్టాఫ్‌రిపోర్టర్ తాళ్లూరి రమేష్, ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఖమ్మం ప్రతినిధి ఎన్.శ్రీధర్, బెట్కో సంస్థ ప్రతినిధి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చావాఉషాకుమారి, శ్రీరామశెట్టి మాధవి, రావూరి సమత వ్యవహరించారు. ఖమ్మం పోటీల్లో ప్రథమ విజేతగా ఖమ్మం నగరం ముస్తాఫానగర్‌కు చెందిన రంగులక్ష్మీస్రవంతి, ద్వితీయ విజేతగా ఆర్టీసీ కాలనీకి చెందిన మారోజు నీరజ, తృతీయ విజేతగా ప్రొద్దుటూరుకు చెందిన నున్నా రాజేశ్వరితో పాటు వై.మమత, కూరపాటి నిర్మల, మన్నె హైమావతి, చావా సుగుణ, మల్లారపు నవ్య కన్సులేషన్ విజేతలుగా నిలిచారు. పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ముగ్గుల పోటీలను అనుబోస్ విద్యాసంస్థల చైర్మన తలశిల భరతకృష్ణ, వైస్ చైర్మన అవని భోగి మంటలు వెలిగించి ప్రారంభించారు. ఆటపాటలతో మహిళలు, కళశాల విద్యార్థినులు అలరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కళాశాల వైస్ చైర్మన అవని, సీడీపీవో కనకదుర్గ, ప్రముఖ గైనకాలజిస్ట్ స్వాతి మాట్లాడుతూ సంప్రదాయాల ప్రాముఖ్యత, ఆచారాల ఔన్నత్యాన్ని వివరించారు. ఈ పోటీల్లో చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌కు చెందిన దాసరి మల్లీశ్వరికి ప్రథమ, ఇల్లందు పట్టణానికి చెందిన తోట యశోద ద్వితీయ, కొత్తగూడెం పట్టణానికి చెందిన సుజాత తృతీయ విజేతలుగా నిలిచారు. వీరితో పాటు ప్రియ, అఖిల, రాజ్యలక్ష్మి, సాయిశ్వేత, భార్గవి కన్సోలేషన బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్ రిపోర్టర్ దుద్దుకూరి రామారావు, ఏబీఎన, అంద్రజ్యోతి విలేకరులు యతిరాజు, అబ్బురాం, పాపారావు, తారకరామారావు, గుణసురేష్, పోటు పుల్లారావు, సంగీతం లెనిన, అనుబోస్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఏవోబీవీ రావు, ఎస్‌కే వలీ, పూర్ణయ్య, కరుణాకర్, మధు, వెంకన్న, మల్లేష్. శ్రీను తదితరులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.సీతామహాలక్ష్మి, డాక్టర్ ఈ.సుగుణ, సేల్స్‌ట్యాక్స్ కార్యాలయ అధికారి పి.పద్మజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ముఖ్య వ్యాఖ్యాతగా రిటైర్డ్ డిగ్రీకళశాల ప్రిన్సిపాల్ వి.నరసింహకుమార్ వ్యవహరించారు.