Share News

Minister Tummala: రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jan 27 , 2025 | 07:23 AM

రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో నిధులు జమ చేస్తున్నామని.. సోమవారం నుంచి నగదు తీసుకోవచ్చునని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Minister Tummala: రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు: మంత్రి తుమ్మల

ఖమ్మం: ఈ ఏడాది రైతు భరోసా (Farmer Assurance) కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతు అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చన్నారు. ఆదివారం నాడు రఘునాథ పాలెం మండలం మల్లెపల్లిలో ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు. లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్చి 31 నాటికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు , రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. 75 ఏళ్లు గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా పవిత్రమైన ఈ రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించుకున్నామని అన్నారు. రైతు రుణమాఫీ రూ. 21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. కలెక్టర్ తినే సన్న బియ్యం పేదలు తినాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు దక్కేలా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రూ. 40 వేల కోట్లు ఏడాదిలో రైతన్నల కోసం ఖర్చు చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌దేనని చెప్పారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌తో రఘునాథపాలెం మండలం ధనిక మండలంగా మారాలని అన్నారు. ఖమ్మం అర్బన్‌‌లో ఉండే రఘునాథపాలెంను మండలంగా తానే ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 07:24 AM