ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandanrao: కవితపై రేవంత్‌ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నమే

ABN, First Publish Date - 2023-09-25T11:40:24+05:30

రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేట: రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు (BJP MLA Raghunandan Rao) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పొద్దున లేస్తే బీజేపీ (BJP)పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. త్వరలో కవిత (BRS MLC Kavitha) అరెస్ట్‌ అవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ప్రచారం చేయడం కేవలం బురదజల్లే ప్రయత్నమే అని అన్నారు. కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లు ఎవరైనా అప్రోలర్ మీకు చెప్పారా అంటూ రేవంత్‌కు ఎమ్మెల్యే సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్‌ఎస్‌ (హఇథ) ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు సంబంధించి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు లైట్ తీసుకుంది.. మీరు ఇద్దరు ఒక్కటేనా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకే రెండు పార్టీల నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మనసు గాయం అయ్యే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు పోతలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 20 - 23 కేసు కోసం మాట్లాడే కాంగ్రెస్ పెద్దలు అంతకంటే ముందు జరిగిన 20 - 16 కేసులో ఎందుకు తెరమీదకు వస్తలేదని నిలదీశారు. తప్పు చేసిన ఏ పార్టీ వారైనా అరెస్ట్‌ చేయాలని.. తమకేమీ అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T11:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising